మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో క్వారీ తవ్వకాలపై పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసును కూడా నమోదు చేశారు. దీంతో దేవినేని ఉమను ఐదురోజుల క్రితం రాజమండ్రి జైలుకు తరలించారు. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై…
గుంటూరులో సంచలనం రేపిన రేవ్ పార్టీ వ్యవహారం పోలీసుల వ్యవహారశైలిని బయటపెట్టింది. లక్ష్మీపురంలోని ఓ బిల్డింగ్ నుంచి… అరుపులు, కేకలు వినిపించడంతో… విసిగిపోయిన స్థానికులు… అక్కడికి వెళ్లి చూశాడు. రేవ్ పార్టీ జరుగుతుండడంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, అక్కడున్న పోలీస్ అధికారి… వారికి వార్నింగ్ ఇచ్చి పంపారు. ఇలా కాదనుకున్న స్థానికులు… ఆ బాగోతాన్ని వీడియో తీశారు. ఆ తర్వాత.. పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పాతిక మంది గుంపు తమ ఇంటి దగ్గర రేవ్…
ఏ ఒక్క పరిశ్రమను మూసి వేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు ఏపీ అటవీ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్.. పర్యావరణ నిబంధనలకు లోబడే పరిశ్రమలను నిర్వహించాలన్న ఆయన.. రెడ్ క్యాటగిరీ పరిశ్రమల్లో కాలుష్యస్థాయి ఏ రకంగా ఉందో తనిఖీలు చేస్తుంటాం.. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలో 54 పరిశ్రమలను తనిఖీ చేశాం.. చిత్తూరు జిల్లాలో అమరరాజాతో పాటు విశాఖ, కాకినాడ, కడప జిల్లాల్లో కాలుష్యకారకాలు ఎక్కువగా విడుదల చేస్తున్న పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు…
జల వివాదంలో తెలుగు రాష్ట్రాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదులు, కేసులు.. ఇలా ముందుకు వెళ్తున్న తరుణంలో.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. తాము తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నాం… అన్నదమ్ముల్లా ఉండాలని మా కోరిక… తగవు పడాలనే ఆలోచనే మాకు లేదన్నారు బొత్స.. ఆంధ్ర ప్రజలను సొంత అన్నదమ్ముల్లా చూసుకుంటానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇది వరకు చెప్పారని గుర్తుచేసిన ఆయన.. అలా అన్నారో లేదో ఆయనే చెప్పాలన్నారు.. ఇక,…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. అయితే, గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో టెస్ట్‌ల సంఖ్య పెరిగింది.. కానీ, పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ఎటూ కదలలేదు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,606 శాంపిల్స్ పరీక్షించగా 1,546 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. చిత్తూరులో నలుగు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, తూర్పు…
వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. ఇవాళ ఐటీ, డిజిటల్ లైబ్రరీలపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పంచాయితీలోనూ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలన్నారు.. అక్కడ నుంచే పని చేసుకునే సదుపాయం ఉంటుందని.. మొదటి విడతలో 4530 డిజిటల్ లైబ్రరీలను నిర్మించాలని.. ఆగస్టు 15న పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఆలోగా స్థలాలు గుర్తించి…
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జాతీయ విద్యావిధానం అమలుపై ఎమ్మెల్సీల అభిప్రాయాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు, అమలవుతున్న పథకాలను ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభినందించినట్టుగా తెలుస్తోంది.. ఇక, జాతీయ విద్యావిధానం అమలుపై పలు సలహాలు సూచనలు చేశారు టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. ఈ సమావేశంలో శాసన మండలి ప్రొటెమ్ ఛైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. 58వ రోజు సీబీఐ విచారణ వేగంగా కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. విచారణకు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి హాజరయ్యారు. అయితే ఈ కేసులో నిన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనుమానితుడు పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్‌ను గోవాలో సీబీఐ అరెస్ట్…
ఏపీ బీజేపీ పూర్తిగా మారిపోయిందా? రోజూ రోడ్డు మీదే ఉంటోందా? ప్రజా సమస్యలు.. పార్టీ కార్యక్రమాలతో బీజీ అయిపోయిందా? ఇంతలోనే అంత ఛేంజ్ ఎలా వచ్చింది? ఈ మార్పు వెనక ఉన్నది ఎవరు? ఢిల్లీకి చెందిన ఆ నేత అంతగా ఎలా ప్రభావం చూపుతున్నారు? ఉత్సాహపరిచారా? ఊరికే కూర్చుంటే ఊరుకోబోమని హెచ్చరించారా? శివప్రకాష్ చెప్పింది చేయకపోతే అసలుకే ఎసరొస్తుందా? ఏపీలో బీజేపీకి ఇంఛార్జ్.. కోఇంఛార్జ్ ఉన్నారు. కేంద్రమంత్రి మురళీధరన్ ఇంఛార్జ్ కాగా.. రాష్ట్రంలో ఉండి పార్టీ కార్యక్రమాల్లో…
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధుకు ఏపీ నగదు బహుమానం ప్రకటించింది. ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో ప్రతిభ చాటుకున్న రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందన్న సీఎం… ఈ విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతిభ చాటుతున్న రాష్ట్ర క్రీడాకారులందరికీ కూడా ప్రభుత్వం తగిన రీతిలో ప్రోత్సహిస్తుందన్నారు సీఎం. పీవీ సింధుకు ఇటీవలే…