జల వివాదంలో తెలుగు రాష్ట్రాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదులు, కేసులు.. ఇలా ముందుకు వెళ్తున్న తరుణంలో.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. తాము తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నాం… అన్నదమ్ముల్లా ఉండాలని మా కోరిక… తగవు పడాలనే ఆలోచనే మాకు లేదన్నారు బొత్స.. ఆంధ్ర ప్రజలను సొంత అన్నదమ్ముల్లా చూసుకుంటానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇది వరకు చెప్పారని గుర్తుచేసిన ఆయన.. అలా అన్నారో లేదో ఆయనే చెప్పాలన్నారు.. ఇక, విశాఖ స్టీల్ విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు బొత్స.. ప్రైవేటీకరణ అడ్డుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు.. ఆస్తి పన్ను విషయంపై స్పందించిన బొత్స.. ఆస్తి పన్ను పెంపు 15 శాతానికే పరిమితం అన్నారు.. ఇది చాలా తక్కువ పెంపు… ఇది ప్రజలకు భారం కాదన్నారు.. ఇక, చట్టం చేసిన రోజే మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయన్నారు మంత్రి బొత్స.. దీనిపై టీడీపీ లాంటి దృష్టశక్తులు అడ్డుకోవాలని చూస్తున్నాయి. దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తాం అన్నారు.. అమరరాజ ఫ్యాక్టరీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి వత్తిడి లేదు… తప్పు చేసి ఉంటేనే నోటీసులు ఇచ్చి ఉంటారు… వాళ్ళు వెళ్లిపోవాలని మేం కోరుకోవడం లేదన్నారు.. వ్యాపారస్తుడికి ఎక్కడ లాభం ఉంటే అక్కడకు వెళతారని కామెంట్ చేశారు.