ఆయన ఎన్నికల్లో గెలవలేదు. పార్టీ అధికారంలోకి రావడంతో ఇంఛార్జ్ హోదాలో నియోజకవర్గంలో పెత్తనం ఆయనదే. చేతిలో పవర్ ఉన్నా కాలం కలిసిరావడం లేదట. మెతకగా ఉంటున్నారని అలుసుగా తీసుకున్నారో ఏమో.. అంతా ఆయన పేరును వాడేసుకుంటున్నారట. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు గగ్గోలు పెడుతున్నారు ఆ ఇంఛార్జ్. సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు! అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి వచ్చిన రెండు సీట్లలో ఇచ్ఛాపురం ఒకటి. బెందాళం అశోక్ గెలిచినా.. ఆయనపై ఓడిన వైసీపీ…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ కాస్త కిందకు దిగాయి.. రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 82,297 శాంపిల్స్ పరీక్షించగా… 2,145 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 24 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 2,003 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. తాజా మృతుల్లో ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, కృష్ణా జిల్లాలో నలుగురు చొప్పున, కడప, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున,…
కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు సిద్ధం అవుతున్నారు.. యాత్ర ఏర్పాట్లపై భారతీయ జనతా పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు… ఈ యాత్రకు స్వాగత కార్యక్రమాలు, చిన్న చిన్న సభలు, బైక్ ర్యాలీలు, కార్యకర్తల సమ్మేళనాలు.. నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు… తన యాత్రలో భాగంగా వనజీవి రామయ్య, చింతకింది మల్లేశంలను కలవనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిషన్‌రెడ్డి టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. తిరుమల శ్రీవారిని, బెజవాడ…
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కోవిడ్ సెకండ్ వేవ్‌లో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూసిన ఈ జిల్లాల్లో తగ్గినట్టే తగ్గి.. పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. దీంతో.. కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. మరికొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.. కోవిడ్ కేసులు కారణంగా రాజమండ్రి ఆదర్శనగర్‌లో రెండు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు అధికారులు.. కోవిడ్ కేసుల కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేయాలని…
హైదరాబాద్‌లోని జలసౌధాలో ఈ నెల 9వ తేదీన గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు రెండు బోర్డుల అధికారులు.. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌శాఖ అధికారులకు లేఖ రాశారారు.. ఈ అత్యవసర సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించనున్నట్టు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది.. అయితే, ఆ వెంటనే గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు…
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో.. గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు విస్తృత అధికారులు కల్పిస్తూ.. వాటి పరిధిలను నిర్ణయిస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్రం.. అయితే, దీనిపై భిన్నమైన వాదనలే ఉన్నాయి.. ఇక, రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారం కాకపోవడం.. ఫిర్యాదుల పర్వం కొనాగుతూనే ఉన్నందున.. ఈ నెల 9న జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి.. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఇరు…
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర మళ్ళీ గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన వరద మళ్ళీ పెరుగుతుండటంతో ముంపు గ్రామాల నిర్వాసితుల్లో ఆందోళన నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతోంది. దేవీపట్నం మండలంలోని 30 గిరిజన గ్రామాలు వరద ముంపులోనే కొనసాగుతున్నాయి. ఇళ్లన్నీ వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద కూడా వరద నీరు తగ్గుముఖం పట్టలేదు. దండంగి, రావిలంక, తొయ్యేరు-దేవీపట్నం…
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తనిఖీ చేసేందుకు కృష్ణా రివర్ బోర్డు బృందం, ఈరోజు తలపెట్టిన పర్యటన అర్ధంతరంగా వాయిదా పడింది. ఈ మేరకు ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శితోపాటు ఇతర అధికారులకు కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి డి.ఎం.రాయిపూరే లేఖ రాశారు. కృష్ణా బోర్డు బృందంలో తెలంగాణ స్థానికత కలిగిన కేంద్ర జలసంఘం అధికారి దేవేందర్‌రావు ఉండటంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ సర్కారు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో పిటిషన్ దాఖలు చేసిన తరుణంలో పర్యటన వాయిదా పడింది.…
పులిచింతల వద్ద కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బ్యారేజీ పూర్తిస్థాయిలో నిండింది. దీంతో నీరును గేట్టు ఎత్తి దిగువకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకొని గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం చేసే సమయంలో ప్రాజెక్టులోని 16 వ నెంబర్ గేటు విరిగిపోయింది. దీంతో ఎమర్జెన్సీ గేటును ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్దకు రాకపోకలను నిలిపివేశారు. పులిచింతల నుంచి ప్రస్తుతం…