ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన దేశీయ ‘కూ’(Koo) యాప్ కు ఇప్పుడిప్పుడే యూజర్లు వస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ‘కూ’ యాప్ ను ప్రోత్సహిస్తూ జాయిన్ అవుతున్నారు. కాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘కూ’ యాప్ లో జాయిన్ అయ్యారు. యూజర్లకు మాతృభాషలో సంభాషించేందుకు వీలు కల్పిస్తున్న కారణంగా ముఖ్యమంత్రి జగన్ ఈ యాప్ లో చేరినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎంఓ ఆంధ్రప్రదేశ్ మరియు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వారి అధికారిక అకౌంట్లను కూ యాప్ లో పొందుపరిచారు. ఏపీ ప్రభుత్వ శాఖల (కూ) అకౌంట్లు రాష్ట్రంలో కొనసాగుతున్న కార్యకలాపాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వేదికగా ఈ యాప్ ను ఉపయోగించనున్నారు. ‘కూ’ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ రాధాకృష్ణ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని స్వాగతిస్తూ.. చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కాగా ఇదివరకే మిగితా సోషల్ నెట్వర్క్ లోను ఏపీ సమాచారాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.