కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. మందు తయారు చేసి వార్తలఎక్కారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య… అయితే, కరోనా థర్డ్ వేవ్ కూడా మందు తయారు చేస్తానంటున్నారు ఆనందయ్య… థర్డ్ వేవ్ లక్షణాలు చూసి తర్వాత.. దానికి కూడా మందు తయారు చేయనున్నట్టు వెల్లడించారు.. మరోవైపు.. నా మందుకు ఇక పేరు పెట్టను అని ప్రకటించారాయన… ఎందుకంటే.. ఆనందయ్య మందుగానే అది అందరికీ పరిచయం అయ్యిందని.. ఇక పేరు పెట్టాల్సిన అవసరం లేదన్నారు ఆనందయ్య. ఎవరు మందు కావాలన్నా.. కొరియర్ ద్వారా ఉచితంగా పంపుతున్నామని తెలిపారాయన.
కాగా, కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో… మందు తయారు చేసి అందరి అభినందనలు అందుకున్నారు ఆనందయ్య… కోవిడ్ ఫస్ట్ వేవ్‌లో ఆయన మందు తయారు చేయకపోయినా.. సెకండ్ వేవ్ సమయంలో ఆయుర్వేద మందు తయారు చేసి ఉచితంగా అందించారు.. ఇది కాస్తా.. ఊరూరా పాకిపోయింది.. దీంతో.. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం.. ఆ మందుపై పరిశోధనలు చేయడం… మందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవని తేల్చడం… మరోవైపు.. ఈ ఇష్యూ హైకోర్టు వరకు చేరడంతో.. మొత్తంగా ఆనందయ్య మందుకు అనుమతి లభించింది. అయితే, ఎవరూ కృష్ణపట్నం రావొద్దని.. ఎక్కడికైనా తామే పంపుతామని చెప్పి.. దానికి అనుగుణంగానే మందు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.