అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారంలో ఇప్పుడు ఏపీలో రాజకీయ విమర్శలకు కూడా దారితీస్తోంది.. అయితే, ఈ అంశంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అంతేకాదు.. టీడీపీ నేతలకు సవాల్ కూడా విసిరారు.. అమర రాజా విషయంలో టీడీపీ విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసినా రోజా.. అది రాజకీయ సమస్య కాదు కాలుష్యం సమస్య అన్నారు.. ఎల్జీ పాలిమర్ విషయంలో చంద్రబాబు ఏం మాట్లాడాడు ? అని ప్రశ్నించిన ఆమె.. రాష్ట్రంలో కాలుష్యం…
కొడుకు, కోడలి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజు పోలీసులను ఆశ్రయించారు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నం 4లో నివాసముంటున్నారు మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణ రాజు… ఆయన వయస్సు 75 ఏళ్లు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారాయన.. ఆయన భార్య జానకి గతేడాది మార్చిలో అనారోగ్య సమస్యలతో మృతిచెందారు.. అయితే, కొడుకు కేవీఎస్ రాజు, కోడలు కంతేటి పార్వతి నుంచి తనకు ప్రాణహాని ఉందంటున్నారు మాజీ…
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపైతంపై దృష్టిసారించిన ఏఐసీసీ.. ఏపీ రాజకీయాలపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ నెల 11న రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించనున్నారు. విడివిడిగా సీనియర్ నేతలతో రాహుల్ మాట్లాడనున్నారు. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నైరాశ్యంలో కూరుకుపోయింది. పార్టీని నడిపించే నాథుడులేక బలహీనపడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత బలహీనమైన కాంగ్రెస్ ఇంతవరకూ కోలకోలేదు. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ను ముందుకు ఎలా తీసుకెళ్లాలి?…
ఏపీ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. నాడు-నేడు రెండో దశ పనులకు ఆమోదo తెలపనుంది కేబినెట్. ఏపీ మంత్రి వర్గం ఇవాళ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రులు సమావేశం కానున్నారు. ఆర్ అండ్ బి శాఖకు చెందిన 4 వేల కోట్ల ఆస్తులను ఆర్డీసీకి బదలాయించే అంశాన్ని కేబినెట్లో ప్రతిపాదించే అవకాశముంది. అలాగే ఏపీ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలపై…
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు రాహుల్ గాంధీ… ఈ నెల 11న ఏపీ కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు జరగనున్నాయి.. 11 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి విడివిడిగా ఏపీ సీనియర్ నేతలతో ముఖాముఖి సమాలోచనలు జరపనున్నారు రాహుల్ గాంధీ.. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి రాష్ట్ర నేతలకు పిలుపు అందింది.. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ పలు కీలక మార్పులు చేర్పులు జరగనున్నాయని తెలుస్తోంది.. పీసీసీ…
వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలుపై కేబినెట్ సబ్ కమిటీ దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర సర్వే, భూయజమానులకు యాజమాన్య హక్కు కార్డుల జారీ తదితర అంశాలపై మంత్రుల కమిటీ అధికారులతో చర్చించింది. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వంద గ్రామాల్లో గ్రామకంఠం పరిధిలో అర్హులైన వారికి భూయాజమాన్య హక్కుతో కూడిన కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు మంత్రుల…
రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం సహజం. ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఇలాంటి పొలిటికల్ వారే నడుస్తోంది. జిల్లాకు ఒకరిని చొప్పున టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకరు రచ్చ చేస్తుంటే.. ఇంకొకరు బురద కడుక్కొంటున్నారు. మరి.. అంతిమంగా ఎవరు పైచెయ్యి సాధిస్తున్నారు? ఎవరి గేమ్ప్లాన్కు ఇంకెవరు చిత్తవుతున్నారు? తాడిపత్రిలో మీడియా అటెన్షన్ క్యాచ్ చేసిన జేసీ! గ్రౌండ్లో ఆడే ఆటల్లానే అటాకింగ్, స్ట్రాటజీ.. డిఫెన్స్ మోడ్ లాంటి విధానాలు రాజకీయ క్రీడల్లోనూ కనిపిస్తాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ…
ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూసేందుకు వినూత్న రీతిలో గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకొచ్చారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తాం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ… ఇకపై ప్రతి నెల ఆఖరి శుక్ర, శని వారాల్లో ఇంటింటికి సచివాలయ సిబ్బంది తిరుగుతారని వెల్లడించిన ఆయన… ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో కూడిన కరపత్రాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తమ…
ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. రేపు సాయంత్రం 5 గంటలకు ఎస్ఎస్సీ ఫలితాలు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు.. కరోన మహమ్మారి కారణంగా 2020, 2021 పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం.. దీంతో.. ఆయా సంవత్సరాల్లో టెన్త్ పరీక్ష ఫీజు చెల్లించినవారంతా పాస్ అయిపోయినట్టే.. అయితే, గ్రేడ్లపై కొంత కసరత్తు జరిగింది.. దీని కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్.. ఇక, హైపవర్ కమిటీ…