గుంటూరు జిల్లాలోని పులిచింతల సమీపంలో ఆదివారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. ఈరోజు ఉదయం 7:15 గంటల నుంచి 8:20 గంటల మధ్యలో మూడుసార్లు భూమి కంపించింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 2.3,2.7,3 గా నమోదయింది. పులిచింతలతో పాటుగా తెలంగాణలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోనూ, సూర్యపేటలోనూ స్వల్పంగా భూమి కంపించినట్టు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలోపల పొరల్లో వస్తున్న మార్పుల కారణంగా భూప్రకంపనలు కలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Read: “పాగల్” టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమరావతి రాజధానిగా ఉండాలని అమరావతి ఉద్యమానికి ప్రజలు నడుం బిగించి నేటికి 600 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా రాజధానిలోని హైకోర్టు నుంచి మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వరకు ర్యాలీని నిర్వహించాలని అమరావతి ప్రాంత రైతులు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి…
గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. జూన్ 19 రాత్రి సీతానగరం పుష్కరఘాట్‌లో ఉన్న ప్రేమికులపై దాడి చేసి యువతిపై అత్యాచారం చేశారు తాడేపల్లికి చెందిన శేరు కృష్ణకిషోర్, వెంకట్. దాదాపు 50 రోజుల తర్వాత నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి ఆచూకీ కోసం మొత్తం 14 టీంలు రాత్రింబవళ్లు శ్రమించాయి. యువతి గ్యాంగ్ రేప్‌కు ముందు నిందితులు ఓ…
అమరావతి ఐకాస రేపు చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ తెలిపారు. రాజధాని రైతుల ఉద్యమం 600 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి ఐకాస రేపు తలపెట్టారు. అదే సమయంలో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ర్యాలీకి సిద్ధమయ్యారు. కాగా కొవిడ్ దృష్ట్యా ర్యాలికి అనుమతి సాధ్యం కాదని డీఐజీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం అనుమతులు సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. 50 మంది కంటే…
పేదలకు పట్టాల పంపిణీ.. ఆ నియోజకవర్గంలోని అధికారులకు అక్షయపాత్రగా మరిందట. భారీగానే నొక్కేసి.. వెనకేసుకున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాసులు దండుకుని.. ఎమ్మెల్యేకే చెవిలో పువ్వులు పెట్టారని పవర్లో ఉన్న పార్టీ కేడర్ చికాకు పడుతోందట. వారెవరో.. ఏం చేశారో.. ఈ స్టోరీలో చూద్దాం. చంద్రగిరిలో 150 ఎకరాలు సేకరించిన అధికారులు! పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు వైసీపీ ప్రభుత్వం పెద్దఎత్తున భూసేకరణ చేపట్టింది. ప్రభుత్వ భూములతోపాటు డీకేటీ భూముల నష్ట…
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసు సమీపంలో ఎస్. ఆర్ ఎనక్లేవ్ అపార్ట్మెంట్ లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముందు భార్యను హత్య చేసిన తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నడింపల్లి నరసింహారాజు, వెంకటమనమ్మగా పోలీసులు గుర్తించారు. భర్త నిడదవోలులో టీచర్ గా పనిచేస్తుండగా, భార్య ఉమెన్స్ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తుంది. కాగా, వీరి మృతికి కుటుంబ కలహాలే కారణంగా త్రీటౌన్ పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసనల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభమైంది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీతారామన్ పాల్గొననున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో నేడు నిర్వహిస్తున్న హ్యాండ్లూమ్ ఫెస్టివల్లో పాల్గొంటారు ఆర్ధిక మంత్రి. తర్వాత విశాఖలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. రేపు నిర్మలా సీతారామన్ విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మృతివనంను సందర్శించనున్నారు. తాళ్లపాలెంలో రేషన్…
పులిచింతల ప్రాజెక్టు వద్ద మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఊడిపోయిన పదహారో గేట్ దగ్గర మరమ్మతు పనులు కొనసాగుతున్నాయ్. సాగర్, తుపాకులగూడెం, పోలవరం నుంచి వచ్చిన నిపుణుల బృందం ప్రాజెక్ట్ వద్ద స్టాప్ లాక్ గేట్ అమర్చే పనిలో నిమగ్నమయ్యారు. స్టాప్ లాక్ ఏర్పాటులో భాగంగా ఒక ట్రయల్ వేయగా అది విజయవంతమైంది. దాదాపు 45 టీఎంసీల నీరు ఉండే ప్రాజెక్టును ఖాళీ చేశారు. డ్యామ్ నీటి మట్టం 6.5 టీఎంసీలకు తగ్గిపోయింది.పదహారో గేటు స్పియర్ బేస్‌తో సహా కొట్టుకుపోవడంతో…
తూర్పు గోదావరిజిల్లా మండపేట ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోది. గడిచిని రెండు రోజులుగా నీరసంగా అనిపించడంతో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా పరీక్షలు చేయించుకున్నారు తోట త్రిమూర్తులు. అయితే.. ఈ నివేదికలో అనూహ్యంగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం.. ఆయన స్వగ్రామం వెంకటాయపాలెంలో హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తనతో సన్నిహితంగా ఉన్న అధికారులు, కార్యకర్తలు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు తోట…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 81,505 శాంపిల్స్ పరీక్షించగా… 2,209 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 22 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 1,896 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,78,350కు.. రికవరీ కేసులు 19,44,267కు పెరిగాయి.. ఇక, కరోనాబారినపడి ఇప్పటి వరకు మృతిచెందినవారి…