ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం దృష్టి సారిందించి. 2014 నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. తెలంగాణ ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పార్టీపై ఏపీ ప్రజలు కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని ఎన్నికల్లో చూపించారు. అయితే, ఈ సంఘటనలు జరిగి ఏడేళ్లు గడిచింది. అయినప్పటికీ ఏపీలో పార్టీ ఇంకా కోలుకోలేకపోతున్నది. పార్టీని తిరిగి బలోపేతం చేసి తిరిగి గాడిలోకి తీసుకొస్తే ఎప్పటికైనా ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నది…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 63,849 శాంపిల్స్‌ను పరీక్షించగా, 1461 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,85,182కి చేరింది. ఇందులో 19,52,736 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,882 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 15 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,564కి…
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో సముద్రం 15 మీటర్ల మేర ముందుకు వచ్చింది. అలలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో పాటుగా సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో బీచ్ లో ఉన్నా దుకాణాలు నేలమట్టం అయ్యాయి. సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారినట్టు వాతావారణశాఖ పేర్కొన్నది. మత్స్యకారులు చేపల…
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పడమర/ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.. పోలీసులపై పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేశారు.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని తన ఇంట్లోని పలు విలువైన పత్రాలతో పాటు కొన్ని వస్తువులని ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్న ఆమె… దీనిపై కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. భూమి పత్రాలతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని.. ఇది బోయిన్పల్లి పోలీసుల పనేనని ఆరోపిస్తున్న అఖిలప్రియ.. ఈ ఘటనపై కూకట్పల్లి పీఎస్‌లో ఫిర్యాదు ఇచ్చారు.. తాను ఇంట్లో లేని సమయంలో కొంతమంది వ్యక్తులు…
ఆంధ్రప్రదేశ్‌లో నాటుబాంబులు కలకలం సృష్టించాయి.. మద్యం మత్తులో ఓ వ్యక్తి నాటుబాంబులతో వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుపతిలోని పాకాల మండలం వల్లివేడు పంచాయతీలో నాటుబాంబుల తీవ్ర కలకలం రేపాయి… మద్యం మత్తులో పది నాటుబాంబులతో వీరంగం సృష్టించాడు కృష్ణయ్య అనే వ్యక్తి… దీంతో.. ఓ నాటుబాంబు పేలింది. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. అయితే, ఆ నాటుబాంబు పేలినా.. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు..…
చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే సచివాలయ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై కోళ్లబైలులో ఎమ్మెల్యే నవాజ్ బాషా పర్యటించారు. నేతన్న నేస్తంకు 5 వేలు లంచం అడిగినట్లు ఉద్యోగిపై స్థానికులు ఆరోపణలు చేశారు. వెల్ఫేర్ అసిస్టెంట్ రాజేష్‌పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో రాజేష్‌పై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశంతో రాజేష్‌ను స్టేషన్‌కు తరలించారు పోలీసులు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి.. లబ్ధిదారులను గుర్తించడానికి వీలుగా.. లబ్ధిదారులకు నష్టం…
సింహాచలం, మాన్సాస్ భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఏపీ సర్కార్ ఆదేశించింది. నోడల్ అధికారిగా దేవాదాయశాఖ కమిషనర్ నియమించింది. ఇప్పటికే ప్రాథమిక నివేదికను సమర్పించిన దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ సింహాచలం ఆలయ ప్రాపర్టీ రిజిస్ట్రార్‌లో 860 ఎకరాల భూములు గల్లంతైనట్టు అంచనా వేస్తోంది. మాన్సాస్ భూముల అమ్మకాల్లో రూ. 74 కోట్లు నష్టం వాటిల్లినట్లు కమిటీ తేల్చింది. ఇప్పటికే అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్, డిప్యూటీ ఈవో సుజాత…
కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాల అమలు విషయం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అమలు చేస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్… ఇప్పటికే పలు పథకాలకు సంబంధించిన సొమ్ములు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం.. రేపు వైఎస్సార్ నేతన్న నేస్తం అమలు చేయడానికి పూనుకుంది.. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఒక్కొక్కరి అకౌంట్లో రూ.24 వేల చొప్పున వేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… రాష్ట్రవ్యాప్తంగా 80,032 మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.192.08 కోట్లు వేయనున్నారు సీఎం…
మైనార్టీ సంక్షేమశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.. వక్ఫ్ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన.. వక్ఫ్ భూములపై పూర్తిస్ధాయిలో అధ్యయనం చేయాలని.. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా ఆ భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని.. వైయస్సార్ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్ ఆస్తులు కూడా సర్వే చేయాలి.. అవసరాలకు తగినట్టుగా మైనార్టీలకు కొత్త శ్మశానాలు ఏర్పాటు చేయాలని…