సీతానగరం గ్యాంగ్ రేప్ :వెలుగులోకి షాకింగ్ నిజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. జూన్ 19 రాత్రి సీతానగరం పుష్కరఘాట్‌లో ఉన్న ప్రేమికులపై దాడి చేసి యువతిపై అత్యాచారం చేశారు తాడేపల్లికి చెందిన శేరు కృష్ణకిషోర్, వెంకట్. దాదాపు 50 రోజుల తర్వాత నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి ఆచూకీ కోసం మొత్తం 14 టీంలు రాత్రింబవళ్లు శ్రమించాయి. యువతి గ్యాంగ్ రేప్‌కు ముందు నిందితులు ఓ వ్యక్తిని హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. సీతానగరం రైల్వేబ్రిడ్జిపై కాపర్ వైర్లు దొంగతనం చేస్తుండగా ట్రైన్‌లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి చూశాడు. పోలీసులకు చెబుతాడనే అనుమానంతో అతన్ని హత్య చేశారు.
Read: లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పై కేసు నమోదు
Also Read
ఆ తర్వాత మృతదేహం ఎవరికీ కనిపించకుండా కృష్ణా నదిలో పడేశారు. యువతిని రేప్ చేశాక..నిందితులు.. పోలీసులకు దొరక్కుండా ప్లాన్డ్‌గా వ్యవహరించారు. ఒకే చోట కాకుండా వేరువేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇందులో కృష్ణా అనే నిందితుడు ట్రైన్‌లో హుబ్లీ పారిపోయాడు. అక్కడి నుంచి నిర్మల్ వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో మకాం పెట్టాడు. అక్కడ నుంచి విజయవాడకు రావడంతో పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఏ1 నిందితుడిని పక్కా ప్లాన్‌తో పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను పట్టుకోవడానికి పోలీసు బృందాలు తీవ్రంగా శ్రమించారన్నారు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్. ఘటనాస్థలంలో ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో కేసు చేధించడం జఠిలంగా మారిందన్నారు. మరోవైపు గ్యాంగ్ రేప్ కేసులో పరారీలో ఉన్న ఏ2 వెంకట్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు.
- Tags
- Andhra Pradesh
- crime
తాజావార్తలు
-
Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
-
Vaibhav Sooryavanshi: బీసీసీఐ సమీక్ష సమావేశం.. వైభవ్ సూర్యవంశీపై కీలక నిర్ణయం!
-
Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
-
Motorola Edge 70 Plus: 200MP కెమెరా.. 6500mAh బ్యాటరీ! Motorola Edge 70 Plus ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!