U19 Asia Cup 2025 Final: అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌కు భారత్.. పాకిస్తాన్‌తో తుది పోరు!
- అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌కు భారత్
- సెమీస్-1లో 8 వికెట్ల తేడాతో విజయం
- పాకిస్తాన్‌తో భారత్ తుది పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్ 19 ఆసియా కప్ 2025 ఫైనల్‌కు యువ భారత్ దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన సెమీస్-1లో భరత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. లంక నిర్ధేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లు విహాన్ మల్హోత్రా (61 నాటౌట్; 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు), ఆరోన్ జార్జ్ (58 నాటౌట్, 49 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. సెమీస్-2లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ గెలిచింది. ఇక డిసెంబర్ 21న దుబాయ్ వేదికగా దాయాదులు భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
శ్రీలంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు విఫలమయ్యారు. ఆయుష్ మాత్రే 7 పరుగులకు అవుట్ కాగా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 9 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరినీ రాసిత్ నిమ్సార అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రాలు బ్యాట్ జులిపించారు. ఇద్దరు హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో భారత్ సునాయాస విజయం అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. చమిక హీనతిగల (42) టాప్ స్కోరర్ కాగా.. విమత్ దిన్సారా (32), సేథ్మికా సెనెవిరత్నే (30) రాణించారు. భారత బౌలర్లలో కిశాంక్ చౌహాన్,హెనిల్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు.
Also Read
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
- India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!