ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమరావతి రాజధానిగా ఉండాలని అమరావతి ఉద్యమానికి ప్రజలు నడుం బిగించి నేటికి 600 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా రాజధానిలోని హైకోర్టు నుంచి మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వరకు ర్యాలీని నిర్వహించాలని అమరావతి ప్రాంత రైతులు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి స్థానికులను మాత్రమే గ్రామంలోకి అనుమతిస్తున్నారు. పోలీసులు అనుమతించకపోయినా న్యాయస్తానం టు దేవస్థానం ర్యాలీ చేపట్టి తీరుతామని ఉద్యమకారులు చెబుతున్నారు.
Read: చిరు సినిమాకు కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ పెంచేసిందా ?