తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసు సమీపంలో ఎస్. ఆర్ ఎనక్లేవ్ అపార్ట్మెంట్ లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముందు భార్యను హత్య చేసిన తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నడింపల్లి నరసింహారాజు, వెంకటమనమ్మగా పోలీసులు గుర్తించారు. భర్త నిడదవోలులో టీచర్ గా పనిచేస్తుండగా, భార్య ఉమెన్స్ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తుంది. కాగా, వీరి మృతికి కుటుంబ కలహాలే కారణంగా త్రీటౌన్ పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.