ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రం లో గత 24 గంటల్లో నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 54,455 శాంపిల్స్ పరీక్షించగా.. 1,413 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో…
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పడమర/ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు,…
మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో రోజుకో కొత్త ట్విస్ట్ అనే తరహాలో కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది… తాజా గా ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతి రాజు తనను ఛైర్మన్‌గా నియమించాలంటున్నారు.. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు ఊర్మిళ.. మొదటి భార్య కుమార్తె సంచయితను ఇటీవలే హైకోర్టు ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే కాగా.. తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం.. ఊర్మిళను, సంచయితను వారసులుగా గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దూకుడు పెంచింది సీబీఐ… వివేకా హత్య కేసు అనుమానితులు మరోసారి హాజరయ్యారు.. ఇవాళ మరోమారు విచారణకు హాజరయ్యారు ఉదయ్ కుమార్ రెడ్డి, ఇనయతుల్లా, రంగన్న, ప్రకాష్ రెడ్డి, వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు శివ ప్రకాష్.. పలుమార్లు వివిధ కోణాల్లో వీరిని విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. మరోవైపు.. సీబీఐ అధికారులను కలిశారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్.. ఇవాళ పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ వెళ్లిన ఇద్దరూ..…
టీటీడీ బోర్డు చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు సీఎం వైఎస్ జగన్… దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టం అందరికి రాదు.. నాకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నానన్న ఆయన.. బోర్డు చైర్మన్ పదవి తీసుకోవడంలో నాకు అసంతృప్తి లేదన్నారు. ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం సాధ్యం కావడం లేదనేది నిజమే.. కానీ, భవిష్యత్…
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలపై అనుమానాలను వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ, వైసీపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని అనుమానంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం ప్రభుత్వంపై నిందలు వేస్తోందని మండిపడ్డ ఆయన.. మంత్రి పేర్ని నాని… బాబాలు పాలిస్తున్నారు అని విమర్శలు చేయడం దారుణం అన్నారు. కేంద్రపై నిందలు వేసేముందే ఒకసారి ఆలోచించుకోరా? అని ప్రశ్నించిన ఆయన.. హిందుత్వాన్ని అవమానిస్తూ మంత్రులు వ్యాఖ్యలు చేయడం శోచనీయం…
మూడు రాజధానులు ప్రజల ఆకాంక్ష.. మూడు రాజధానులు వచ్చి తీరతాయని స్పష్టం చేశారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల హృదయాల నుంచి ఉద్యమాలు పుడతాయి, కొంతమంది ప్రయోజనాల కోసం చేసే వాటిని డ్రామాలంటారు అని మండిపడ్డారు.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోందన్న ఆయన.. 600 రోజులు అయ్యాయని ఒక పండుగ వాతావరణం టీడీపీలో కనిపిస్తోంది.. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను…
అమరావతి ఉద్యమం ప్రారంభమయ్యి 600 రోజులు పూర్తైన సందర్బంగా న్యాయస్తానం టు దేవస్థానంకు ఉద్యమకారులు పిలుపునిచ్చారు. దీంతో రైతులు, మహిళలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేశారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఉద్యమకారులను అడ్డుకున్నారు. దీంతో రైతులు, మహిళలు రోడ్లపై భైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతు మహిళలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు మహిళా ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలోని మందడం, వెంకటపాలెంలో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.…