హెటిరో డ్రగ్స్ సంస్థల్లో జరుగుతున్న ఐటీ సోదాల్లో వందల కోట్ల నగదు బయట పడడంతో అధికారులే నోరు వెల్లబెడుతున్నారు.. ఐటీ దాడులులో అక్రమాలు వెలుగు చూడడంతో పాట గుట్టల కొద్ద డబ్బులు దర్శనమిస్తున్నాయి.. మూడు రోజులుగా హెటిరో డ్రగ్స్‌లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతుండగా.. రెండో రోజే రూ.100 కోట్లకు పైగా నగదు సీజ్ చేశారనే వార్తలు వచ్చాయి.. కానీ, ఇవాళ ఆ మొత్తం ఏకంగా రూ.200 కోట్లకు చేరినట్టుగా తెలుస్తోంది.. మూడ్రోజులుగా హెటిరో డ్రగ్స్‌లో ఐటీ…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 48,235 శాంపిల్స్ పరీక్షించగా.. 693 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 6 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 927 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,86,60,811 కు…
మత్తు పదార్ధాల అక్రమ రవాణా వ్యవహారంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆదానిపై దేశద్రోహం కేసు పెట్టాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇక, మత్తు పదార్థాల రవాణాకు సహకరించిన వారిపైన చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు.. రోజుకి వెయ్యికోట్లు సంపాదించడానికి ఆదానీ ఏమైనా మాయల పకీరా..? అంటూ ప్రశ్నించిన ఆయన.. డ్రగ్స్ ఎవరు తయారు చేస్తున్నారు.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. వాళ్లను పట్టుకోవాలన్నారు. మానవ బలహీనతను ఆసరాగా చేసుకుని డ్రగ్స్ దందా జరుగుతోందని…
అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.. రైతులకు మంచి ధర అందేలా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీని పెంచేలా చూడాలని.. దీని వల్ల రైతులకు మంచి ధర వస్తుందన్నారు. ధరల విషయంలో ఎక్కడ ఇబ్బందులు ఉన్నా వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునే చర్యలను దూకుడుగా చేపట్టాలని పేర్కొన్న సీఎం…
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పింది అంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు సకాలంలో ఇవ్వకపోతే ఎలా..? అని నిలదీసిన ఆయన.. వృద్ధాప్యంలో వారి వైద్య ఖర్చులకీ ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని… రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పడమే దీనికి కారణంగా తెలిపారు పవన్ కల్యాణ్… మరోవైపు.. పోలీసుశాఖలో…
దేవాదాయ శాఖ కమిషనరుగా బాధ్యతలు స్వీకరించారు హరి జవహర్ లాల్. దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు వంటి అంశాలపై ఉద్యోగులతో జవహర్ లాల్ సమీక్ష నిర్వహించారు. అందులో హరి జవహర్ లాల్ మాట్లాడుతూ.. దేవాలయాల్లో కైంకర్యాలు, పూజలు సంప్రదాయ బద్దంగా జరిగేలా చూస్తాం. ఆలయాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించే అంశంపై దృష్టి పెడతాం. ఆధ్యాత్మిక వాతావరణం ఆలయాల వద్ద కనిపించాలి. హిందూ సంప్రదాయాలను గౌరవించేలా, ఆచరించేలా ప్రోత్సహిస్తాం.…
డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన కామెంట్స్ ఆ పార్టీకే ఇబ్బందులు తెచ్చిపెట్టాయా? రాజకీయ లబ్ధికోసం గుడ్డిగా ఏదేదో మాట్లాడి ఓ సామాజికవర్గాన్ని దూరం చేసుకునే పరిస్థితి దాపురించిందా..? కాకినాడ ఎపిసోడ్ తర్వాత టీడీపీలో వినిపిస్తున్న గుసగుసలేంటి.. రుసరుసలేంటి..? కాకినాడలో పట్టాభి కామెంట్స్ కలకలం..! ముంద్రా పోర్టులో హెరాయిన్ పట్టుబడిన అంశాన్ని అధికార వైసీపీకి చుట్టేస్తూ.. టీడీపీ పెద్దఎత్తున ప్రెస్మీట్ల పోరాటం చేస్తోంది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పొద్దుపోయేంత వరకు టీడీపీలో చంద్రబాబు…
అనంతపురం : ఏపీ సర్కార్ పై మరోసారి ఫైర్ అయ్యారు పయ్యావుల కేశవ్. జగన్ ప్రభుత్వం అసమర్థత వల్ల విద్యుత్ రంగంలో తప్పులు జరుగుతున్నాయని… రాయలసీమ పవర్ ప్లాంట్ ను అన్యాయంగా మూసివేశారని మండిపడ్డారు. అత్యధిక ధరలకు విద్యుత్ ను బయట నుంచి కోనుగోలుచేయడం ఎవరిదీ తప్పు…? అని ప్రశ్నించారు పయ్యావుల. ప్రస్తుతం విద్యుత్ సంస్థలో ప్రక్షాళన అవసరమన్నారు పయ్యావుల. ట్రూ అప్ పేరు ఎక్కడి నుంచి వచ్చిందని… ట్రూ అప్ ఛార్జీలను ఎందుకు విత్ డ్రా…
సరుకు రవాణ చేసే గూడ్స్ రైళ్లు మహా అయితే 50 నుంచి 80 బోగీలు ఉంటాయి. ఇండియన్ రైల్వేలకు సరుకు రవాణా ద్వారానే అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది. అయితే, ఎక్కువ గూడ్స్ రైళ్లను నడపడం వలన ప్రజా రవాణా రైళ్లకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ఇండియన్ రైల్వే వ్యవస్థ అనేక ప్రయోగాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే 176 బోగీలు, 6 రైలు ఇంజన్లతో కూడిన త్రిశూల్ రైలును తయారు చేసింది. ఇది పూర్తిగా…
తెలుగు అకాడమి స్కాంలో పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగుచూశాయి. తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపర్చారు. 9 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో ఇప్పటికే 10మందిని అరెస్ట్ చేశామని వీరిలో కీలక సూత్రదారి సాయికుమార్ గా తేల్చారు. ఈ కేసులో 10 మంది నిందితులు వివరాలు ఇలా ఉన్నాయి. A1. మస్తాన్ వలి (యూనియన్ బ్యాంక్ మేనేజర్), A2.…