హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో భారీగా నగదు బయటపడింది.. ఇవాళ హెటిరో డ్రగ్స్ సీఈవో, డైరెక్టర్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.. తొలిరోజు సోదాలు ముగిసిన తర్వాత సీఈవో, డైరెక్టర్ ఇళ్లతో పాటు కార్పొరేట్ ఆఫీస్‌లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.. దాదాపు రూ. 100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుండగా.. ఎంత నగదు అనేదానిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.. అయితే, సోదాలు పూర్తిస్థాయిలో ముగిసిన తర్వాత నగదు ఎంత…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్చ మరోసారి భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 48,028 శాంపిల్స్ పరీక్షించగా.. 643 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 8 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 839 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో…
టీటీడీ పాలకమండలి ఇవాళ జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదముద్ర వేసింది. చెన్నై, బెంగళూరు, ముంబైలో టీటీడీ సమాచార కేంద్రాలు మరియు శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్ల నియామకానికి ఆమోదం లభించగా.. చెన్నై కేంద్రానికి ఏజే శేఖర్ రెడ్డి, బెంగళూరు కేంద్రానికి రమేష్ శెట్టి, ముంబై కేంద్రానికి అమోల్ కాలేను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక, అలిపిరి కాలిబాట సుందరీకరణ…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. మొత్తంగా వెయ్యి ఓట్లు కూడా లేని మా ఎన్నికలపై అంతా ఫోకస్ పెట్టేలా పరిస్థితి తయారైంది.. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన కొంతమంది తప్పుకున్న తర్వాత.. ఫైనల్‌గా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.. దీంతో.. రెండు ప్యానెళ్లకు చెందినవారి మధ్య యుద్ధమే నడుస్తోంది.. మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ రూ.10 వేలు పంచుతుందంటూ.. మెగా బ్రదర్ నాగబాబు…
విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయ్. ప్రతీఏటా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఐతే…కోవిడ్ పరిస్థితులతో…ఆంక్షల నడుమ ఏర్పాట్లు చేశారు. రోజుకు గరిష్టంగా 10 వేల మందికి దర్శనం దక్కేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం మాదిరిగా టైం స్లాట్ ప్రకారముగా రోజుకు పదివేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. భక్తులు ఆన్లైన్ ద్వారా టైం స్లాట్ ప్రకారం వెబ్సైట్లోకి వెళ్లి దర్శనం టిక్కెట్లు బుక్…
కడప జిల్లాలోని బద్వేలు నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించారు. అయితే, గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేన, టీడీపీలు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నాయి. కానీ, బీజేపీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపింది. రాజకీయాలను రాజకీయాల మాదిరిగానే చూస్తామని చెప్పిన బీజేపీ, బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై కడప జిల్లా నేతలతో చర్చలు ఏపీ బీజేపీ చర్చలు నిర్వహించారు.…
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. స్కామ్ కు పాల్పడ్డ ముఠాలోని పది మందిని అరెస్ట్ చేశారు. కేసులో పది మందిని ముద్దాయిలుగా పేర్కొన్నారు పోలీసులు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలీతో కుమ్మక్కై తెలుగు అకాడమీ డిపాజిట్లను నిందితులు కాజేశారు. ఈ ఏడాది జనవరి నుంచి స్కామ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కమీషన్ ఎర చూపించి.. బ్యాంక్, అకాడమీ సిబ్బందిని ముగ్గులోకి దింపారు నిందితులు. గతంలోనూ ఈ ముఠా…
విశాఖపట్నంలో మైనర్ బాలిక మృతి కేసులో సంచలనంగా మారింది.. అయితే, అగనంపూడి సమీపంలో శనివాడలో ఆదిత్య అపార్ట్మెంట్ వాచ్మెన్ కుమార్తె పావని డెత్ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. రాత్రివేళ తల్లిదండ్రులు తనను ఒంటరిగా అబ్బాయితో చూస్తారన్న భయంతో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బాలిక తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్న పక్క అపార్ట్మెంట్ 101లో ఉంటున్న యువకుడు నగేష్‌ను కలిసేందుకు బాలిక వెళ్లిందని.. ఇద్దరూ కలిసి మేడపైకి…
డ్రగ్స్ వ్యవహారంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది… తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరూ అంటే బ్రోకర్ సజ్జల ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? అంటూ ప్రశ్నించారు.. మా నాన్న మారిషస్-నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మాని, డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ జగన్ బినామీ ద్వారంపూడి…