బద్వేల్‌లో నైతిక విజయం బీజేపీదే.. ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ గల్లంతు అయింది. వైసీపీ అభ్యర్థి మొదటి రౌండ్ నుంచి ఏకపక్షంగా ఫలితాలను నమోదు చేసి ఘన విజయం సాధించింది. 90,411 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ గెలుపొందారు.. అయితే, బీజేపీ అభ్యర్థి సురేష్‌కు 21 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.. ఇక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలమ్మకు 6 వేల పైచిలుకు ఓట్లు పోల్ అయ్యాయి.. కాగా, డిపాజిట్ గల్లంతు అయినా.. బీజేపీ ఓటింగ్ మాత్రం గణనీయంగా పెరిగిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు..
బద్వేల్ ఉప ఎన్నిక ఫలితంపై స్పందించిన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ.. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు… ఇక, బీజేపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది.. బద్వేల్ ఉప ఎన్నిక బీజేపీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చిందని వెల్లడించారు.. బద్వేల్ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఉంది… అక్కడ అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించిన ఆయన.. వైసీపీకి ఓటెయ్యకపోతే సంక్షేమ పథకాలుని లిపివేస్తామని బెదిరించారని.. బద్వేల్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదన్నారు. ఈ ఎన్నికలో నైతిక విజయం బీజేపీదేనన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు.. బీజేపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగిందని.. 2024 ఎన్నికలకు బీజేపీ ప్రధాన పార్టీగా అవతరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కన్నా లక్ష్మీనారాయణ.
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!