రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ… ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది అని కామెంట్ చేసారు. ఎంతో మంది ఆర్థిక సలహాదారులు గా ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయమైన స్థితిలో ఉండడం దారుణం అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు. పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి 4068 కోట్లు కు సంబంధించి కొర్రీలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం…
ఏపీపై బీజేపీ హైకమాండ్ ఆశలు వదిలేసుకుందా? తెలంగాణకు ఇచ్చిన ప్రాధాన్యతలో ఒక్కశాతం కూడా ఏపీకి ఎందుకు ఇవ్వడంలేదు? ఎంత చేసినా అక్కడ నుంచి అంతకు మించి వచ్చేది ఏమీలేదని డిసైడ్ అయ్యిందా? లేక పదవులు పొందేస్థాయి ఉన్న నేతలెవరూ లేరనా? పదవుల పందేరంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆరో వేలిలా చూస్తోంది అందుకేనా? ఏపీ బీజేపీకి ఒకటి అరా పదవులే..! ఏపీ బీజేపీ శాఖను ఆ పార్టీ హైకమాండ్ లైట్ తీసుకుంటున్నట్టుంది. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల్లో రాష్ట్రానికి ఇస్తున్న…
శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ మధ్య టీడీపీ దీన్ని బాగా ఫాలో అవుతోంది. ఒకప్పటి ఆప్త మిత్రుడు పవన్‌కు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తోంది. ఆయన్ను వైసీపీ విమర్శిస్తే టీడీపీ కస్సుమని ఒంటి కాలిపై లేస్తోంది. అది పార్టీలోని ఓ వర్గ నేతలకు అస్సలు నచ్చడం లేదట. మనల్ని పట్టించుకోని అతనికేంటి అంత ప్రయార్టీ అంటూ ఒకటే గుసగుసలు.. రుసరుసలట..! ఇటీవల పవన్‌కు అండగా టీడీపీ కామెంట్స్..! ఇటీవల ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే పొత్తులు.. సమీకరణాలు…
గత ఏడేళ్లుగా ప్రధాని మోడీ మాత్రమే ఏపీని అభివృద్ధి చేస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి హైవే లు, ఫ్లై ఓవర్లు, ఎయిమ్స్ వంటివి కేంద్రమే రాష్ట్రంలో నిర్మాణం చేస్తుందని.. రూ. 2 వేల కోట్లతో టెండర్లు పిలిచినా ఎవరూ రాని దౌర్భాగ్య స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రోడ్ల మరమత్తులు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేశారని కానీ…. తాము 7 నెలల క్రితమే చేపట్టామన్నారు. టిడ్కో ఇళ్ల కోసం కేంద్రం…
సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే సీఎం జగన్ మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ ప్రతిపక్ష పార్టీలు నిశితంగా గమనిస్తూనే తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు పొత్తులతో వెళుతారా? లేదంటే సోలోగానే ఎన్నికలకు వెళుతారా? అనే చర్చ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతోంది.…
ఏపీ సీఎం జగన్ ఈ నెల 11, 12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 11వ తేదీ తాడేపల్లి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు… సీఎం. తిరుపతిలో బర్డ్ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు… పైకప్పుతో కొత్తగా నిర్మితమైన అలిపిరి మెట్ల మార్గాన్ని, పాదాల మండపం వద్ద కొత్తగా నిర్మించిన గో మందిరాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని… శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 11న రాత్రికి పద్మావతి…
బద్వేల్ ఉపఎన్నికలో పోటీ.. ఆ రెండు జాతీయపార్టీల మధ్యేనట. ఇదేంటి.. అధికారపార్టీని వదిలేసి.. ఉనికి కూడా లేని ఆ పార్టీల మధ్య పోటీ ఉందంటున్నారు అని అనుకుంటున్నారా? మీరే చూడండి. ఇంతకీ ఆ పార్టీలు పోటీ పడుతోంది గెలవడానికా…? ఓడిపోడానికా..? పోటీకి సై అని కాలుదువ్వుతున్న బీజేపీ, కాంగ్రెస్..! బద్వేల్ ఉపఎన్నికల బరి నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైదొలిగింది. మరణించిన శాసనసభ్యుల కుటుంబాల నుంచి అభ్యర్ధులు బరిలో ఉన్నప్పుడు పోటీ చేయకూడదన్న సాంప్రదాయానికి తమ పార్టీ…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తే తప్ప రాష్ట్రానికి భవిష్యత్ ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు కనిగిరికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు… ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… నదుల అనుసంధానం చేసి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నామని.. కానీ, పక్క రాష్ట్రంతో గొడవపడి హక్కులన్ని కేంద్రానికి అప్పజెప్పారని విమర్శించారు. కాల్వలు తవ్వాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి…
టీడీపీ అధినేత చంద్రబాబు చూడని రాజకీయం.. చూడని ఎత్తుపల్లాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎక్కువ కాలం పని చేసిన ఘనత చంద్రబాబుకు ఉంది. అలాగే రాష్ట్ర విభజన తర్వాత కూడా నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొత్త రికార్డు సృష్టించారు. అలాంటి చంద్రబాబు తన రాజకీయం జీవితంలో ఎన్నడూ లేనివిధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కనీసం సొంత నియోజకవర్గంలోనూ పార్టీని గాడినపెట్టలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తుంది.…
విద్యుత్ సంక్షోభం ఇప్పుడు భారత్‌ను టెన్షన్ పెడుతోంది… ఈ తరునంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విద్యుత్ సంక్షోభంపై వెంటనే జోక్యం చేసుకోవాలి లేఖలో విజ్ఞప్తి చేశారు.. యూరోప్, చైనాల్లో ఉన్న విద్యుత్ సంక్షోభం ఇప్పుడు భారత దేశాన్నీ తాకిందని లేఖలో పేర్కొన్న సీఎం.. కోవిడ్ అనంతరం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గత ఆరు నెలల్లో 15 శాతం, గత నెల నుండి 20 శాతం పెరిగిందని.. బొగ్గు…