ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అప్పుల కోసం విశాఖలో విలువైన, చారిత్రక భవనాలను తాకట్టు పెడుతున్నారని.. ఆదాయం పెంచకుండా ప్రజా ఆస్తులను అమ్మేస్తున్నారు, తాకట్టు పెడుతున్నారని.. చివరకు ప్రైవేటు ఆస్తులను కూడా తాకట్టు పెడతారేమో? అంటూ ఎద్దేవా చేశారు. అమరావతి ద్వారా వచ్చే రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ సంపదను…
ముగ్గురు ఎమ్మెల్యేలు..30 మంది కార్పొరేటర్ల బలం ఉంది. సమర్ధత ఉన్నా.. అధికారపార్టీని ఢీకొట్టడానికి సాహసించే పరిస్థితి లేదు. అనుబంధ సంఘాల పోరాటాలే తప్ప ముఖ్య నాయకులు గప్‌చుప్. కష్టకాలంలో పార్టీని నడిపించాల్సిన ఆ ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారా? సైడ్ అయ్యారా? ఎవరు వాళ్లు? విశాఖ టీడీపీ ప్రజాప్రతినిధుల్లో నైరాశ్యం..! ఉత్తరాంధ్రలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగిలింది. హేమాహేమీలకే ఓటమి తప్పలేదు. ఇటువంటి పరిస్ధితుల్లోనూ టీడీపీకి గౌరవం కట్టబెట్టారు విశాఖ ఓటర్లు. హోరాహోరీ పోరులో నాలుగుచోట్ల…
పదవంటే ఎవరికి చేదు? అందులోనూ మంత్రి పదవి అంటే ఎమ్మెల్యేలకు ఒక డ్రీమ్..! ప్రస్తుతం అలాంటి కలను సాకారం చేసుకునే పనిలో యాగాలు, యాత్రలను నమ్ముకున్నారు ఆ జిల్లాలోని అధికారపార్టీ ఎమ్మెల్యేలు. అమాత్య అని అనిపించుకోవడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారట. వారెవరో.. ఏంటో ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా నుంచి మంత్రి అయ్యే ఛాన్స్ ఎవరికి? కేబినెట్లో చోటుకోసం కర్నూలు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలతోపాటు తొలిసారి గెలిచిన ఒకరిద్దరు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ పవర్లోకి…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.. ఏపా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 46,558 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 800 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇక, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పు, చిత్తూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున తాజాగా 9 మంది మృతిచెందారు. ఇదే సమయంలో 1,178 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కారు.…
నైరుతి బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలోని ఉపరితల ఆవర్తనం ఈరోజు కోస్తా తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 5.8 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు(పైకి) వెళ్ళే కొలది నైరుతి దిశ వైపు వంగి కొనసాగుతున్నది. తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి పైన తెలిపిన కోస్తా తమిళనాడులో గల ఉపరితల ఆవర్తనం నుండి ఆగ్నేయ అరేబియా సముద్రము వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 km నుండి 3.1 km ఎత్తుల మధ్య…
వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్… కోవిడ్ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, మెడికల్ కాలేజీలు, హెల్త్ హబ్స్‌పై చర్చించారు.. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపై ఆరా తీసిన ఆయన.. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వైద్యంకోసం వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని.. మన రాష్ట్రంలోనే అన్ని వ్యాధులకు చికిత్స అందించే విధంగా ఉండాలని స్పష్టం చేశారు సీఎం…
పండుగలు వచ్చాయంటే చాలు.. పట్టణాల్లో స్థిరపడినవారు సైతం.. తాను పుట్టిన ప్రాంతానికి వెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.. దీంతో, రద్దీ పెరిగిపోతోంది.. అయితే, రానున్న దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. ప్రత్యేకంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.. ఈ బస్సులు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇక, పండుగన సీజన్లో ప్రత్యేక బస్సులను…
ఏపీలో పీకే టీం రంగంలోకి దిగిందా? అంటే అంతా అవుననే సమాధానమే విన్పిస్తుంది. గడిచిన రెండ్రోజులుగా పీకే టీం విశాఖలో తిష్ట వేసినట్లు తెలుస్తోంది. స్థానికులు, ప్రజాప్రతినిధుల నుంచి పీకే టీం అభిప్రాయ సేకరణ చేపడుతుందనే టాక్ విన్పిస్తోంది. విశాఖలో ప్రస్తుతం ఆరాతీస్తుందట.. ఆ తర్వాత రాష్ట్రమంతటా వీరు సర్వే చేస్తారని తెలుస్తోంది. వీరి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని ఓ రిపోర్టును తయారు చేస్తున్నారట. దీంతో ఈ సర్వే ఎందుకు కోసం జరుగుతుందనే పలువురు ఆరా…
వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ తరుఫున వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధ బరిలో ఉన్నారు. ఆమె గెలుపు లాంఛనమే అయినా పోటీ మాత్రం తప్పదని తెలుస్తోంది. వైసీపీకి అంతో ఇంతో పోటీనిచ్చే టీడీపీ, జనసేన బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యేందుకు మార్గం సుగమం అయింది. అయితే వైసీపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేని బీజేపీ, కాంగ్రెస్ లు…
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ గత వైభవాన్ని సంతరించుకునేందుకు పావులు కదుపుతున్నది. తెలంగాణలో పీసీసీలో మార్పులు చేసిన తరువాత దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంటే, ఏపీలో అందుకు విరుద్ధంగా ఉండటంతో పార్టీలో తిరిగి నూతనోత్సాహం నింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో కుదేలైంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్ లోని కీలక నేతంతా…