దేశంలో రైతులను దొంగల్లా చూసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని టీడీపీ సీనియర్ నేత కూన రవి కుమార్ అన్నారు. రాష్ట్ర ఆర్దిక వ్యవస్ధకి రైతులే వెన్నెముక.. జగన్ ఆ వెన్నెముక లేకుండా చేస్తున్నారు. భూగర్జ జలాలు పెంపొందించి కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నీరు చెట్టుకి శ్రీకారం చుట్టారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి ఏంటంటే.. రైతు ఆత్మహత్యలో 3 వస్ధానం, కౌలు రైతు ఆత్మహత్యల్లో 2 వస్ధానం అని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులున్నారన్న జగన్ 40 వేల మందికే రైతు భరోసా ఇస్తున్నారు. నీరు చెట్టు పనులు చేసిన రైతులకు టీడీపీ ముద్ర వేసి రూ. 1,700 కోట్లు ఇవ్వకుండా జగన్ రైతుల్ని వేధిస్తున్నారు అని చెప్పారు. వైసీపీ చేత కాని పాలనతో వందల టీఎంసీల నీరు సముద్రం పాలు చేశారు. తెలంగాణ అధిక వాటా వాడుకుంటున్నా నోరు మెదపటం లేదు అన్నారు. నీరు చెట్టు పనుల్లో ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చే అధికారులపై రాబోయే రోజుల్లో చర్యలు తప్పవు. జగన్ రెడ్డి తన నిర్ణయం మార్చుకుని నీరు చెట్టు పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాలి అని పేర్కొన్నారు.