విజయవాడ బెంజ్ సర్కిల్ కొత్త ఫ్లై ఓవరును ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ… విజయవాడ వాసుల దశాబ్దాల ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుండటం సంతోషంగా ఉంది. గడ్కరీ విజయవాడ నగరానికి ఏది అడిగినా కాదనకుండా చేశారు అని తెలిపారు. చంద్రబాబు విజన్, గడ్కరీ సహకారంతో రికార్డు కాలంలో రెండు ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి అన్నారు. రెండో ఫ్లైఓవరును అనుకున్న సమయానికి 6 నెలల ముందే జాతీయ రహదారి అభివృద్ధి అధికారులు పూర్తి చేశారు. సర్వీస్ రోడ్డు అభివృద్ధికి కూడా కేంద్రం సహాయ సహకారాలు అందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి పైసా భారం పడకుండా బెంజ్ సర్కిల్ రెండు ఫ్లై ఓవర్లతో పాటు సర్వీస్ రోడ్డు అభివృద్ధికి కేంద్రమే నిధులు కేటాయించేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేసింది అని పేర్కొన్నారు ఎంపీ కేశినేని నాని.