కరోనా మహమ్మారి కట్టడి కోసం కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ లాంటి ఆంక్షలు విధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా సడలింపులు ఇస్తూ వచ్చింది.. అయితే, నైట్ కర్ఫ్యూ మాత్రం కొనసాగుతూనే ఉంది… తాజాగా మరోసారి నైట్ కర్ఫ్యూను పొడిగించింది ఏపీ ప్రభుత్వం… ఈ నెలాఖరు వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది… అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కోవిడ్ ఆంక్షల్లో భాగంగా నైట్ కర్ఫ్యూ అమల్లో…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,786 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 517 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు. ఇదే సమయంలో 826 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.…
ఉమ్మడి ఆంధప్రదేశ్ విభజనతో నవ్యాంధ్ర భారీగా నష్టపోయిందని ఏపీవాసులు ఇప్పటికీ మథనపడుతున్నారు. ఈ కారణంగానే ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను వరుస ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి అయితే ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని తెలుస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి ఉండటంతో ఏపీలో ఆపార్టీ పర్వాలేదనిపిస్తోంది. ఇక నవ్యాంధ్రలో తొలిసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న ఆపార్టీ సంక్షేమ కార్యక్రమాల కంటే అభివృద్ధిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అయితే ఈ…
ఈ నెఖరులోగా పీఆర్సీ అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని… వచ్చే నెలాఖరులోపు ఉద్యోగుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలన్నది ఏపీ ప్రభుత్వం ఆలోచన అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వచ్చే నెలన్నరలోనే ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో సీఎంవో అధికారుల సమావేశం ముగిసింది. అనంతరం సజ్జల మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ కార్యనిర్వాహకులుగా ఉద్యోగులు ఉన్నారని… వారి సంక్షేమం, భవిష్యత్తు, ఉద్యోగ భద్రతపై రెండు అడుగులు ముందే ఉండాలన్నది…
కాకినాడ మేయర్‌పై ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవిశ్వాస తీర్మానంలో సభ్యుల విశ్వాసం కోల్పోవడంతో పావని మేయర్ పదవిని కోల్పోయారు. అయితే, ఈ అవిశ్వాస తీర్మానంపై మేయర్ గతంలో కోర్టుకు వెళ్లారు. తీర్మానం ప్రవేశ పెట్టి ఓటింగ్ జరిగినప్పటికీ, ఆ ఫలితాలను ఈనెల 22 వరకు ప్రకటించ వద్దని హైకోర్టు పేర్కొన్నది. కానీ, ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం హడావుడిగా కాకినాడ మేయర్‌ను తొలగిస్తూ గెజిట్‌ను విడుదల చేసింది. దీనిపై మండిపడ్డ పావని, కేసు…
ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి… విశాఖలో ఏపీ ఎడ్ సెట్ ఫలితాలను విడుదల చేశారు కన్వీనర్ విశ్వేశ్వర్ రావు… ఈ ఏడాది ఎడ్ సెట్‌కు 15638 మంది దరఖాస్తు చేసుకోగా… అందులో 13,619 మంది పరీక్షకు హాజరయ్యారు.. ఇక, ఫలితాల్లో 13,428 మంది అంటే.. 98.60 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ విశ్వేశ్వర్రావు వెల్లడించారు.. ఇక, కిందటేడాది డాటా ప్రకారం అందుబాటులో ఉన్న సీట్లు 42 వేలు కాగా… కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే…
న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధి హామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు… గ్రామాలను అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్లపై కక్ష సాధింపులా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గం. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రావడం లేదు. అభివృద్ధి పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఏలూరులో రంజిత్ అనే కాంట్రాక్టరుకు బిల్లులు ఇవ్వకుండా వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశారు. రంజిత్ కు మెరుగైన వైద్య సేవలు…
జలసౌధలో ఈరోజు ఉదయం 11 గంటలకు కేఆర్ఎంబి సమావేశం జరగనుంది. 14 నుంచి గెజిట్ అమలు నేపథ్యంలో బోర్డ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణ బేసిన్ లోని తెలంగాణ 7 ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ 22 ప్రాజెక్ట్స్ బోర్డ్ పరిధిలోకి వెళ్లనున్నవి. జలవిద్యుత్ ని గెజిట్ ప్రకారం బోర్డు పరిధిలోకి తీసుకురావడం పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కృష్ణ పై విద్యుత్ పంపుహౌస్ లను బోర్డ్ పరిధిలోకి ఇవ్వాలని కోరిన ఆంద్రప్రదేశ్… తెలంగాణ విద్యుత్ పేరిట…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తైంది. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక కోసం మొత్తం 27 నామినేషన్లు దాఖలవ్వగా అందులో 9 నామినేషన్లను తిరస్కరించారు. దీంతో బద్వేల్లో 18 మంది బరిలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇటు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం 61 నామినేషన్లు దాఖలవ్వగా, ఇందులో 19 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు నిలిచారు.…