విశాఖలో విషాదం.. చేపల వేటకు వెళ్ళి నలుగురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కుటుంబాల్లో కన్నీళ్ళు తెచ్చింది. చాపరాతి పాలెం గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులు చేపల వేటకు వెళ్లి వాగు ఊబిలో చిక్కుకున్నారు. దీంతో నలుగురు మృతి చెందారు. మరణించిన వారిని గూడెంకొత్తవీధి మండలం పెద్ద వలస పంచాయితీ చాపరాత్రి పాలెం గ్రామానికి చెందిన గడుతూరి నూకరాజు(35), గడుతూరి తులసి (7), గడుతూరి లాస్య( 5)పాతూని రమణ బాబు (25)గా గుర్తించారు.
వీరు నలుగురు కలిసి బొంతు వలస కాలువ లో చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. అక్కడ ప్రవాహం బాగా పెరిగింది. అక్కడ ఊబి ఉందని తెలియక, నలుగురు ఒక్కసారిగా దిగడంతో అక్కడికక్కడే మృతి చెందారుజ. వారితో వచ్చిన మరో ఒక చిన్నారి ఒడ్డు పైన ఉండడంతో ప్రాణాలతో బయటపడింది. ఆ చిన్నారి జరిగిన ప్రమాదం గురించి చాపరాతి పాలెం గ్రామస్తులకు చేరవేసింది.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అన్వేషించారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి ఇద్దరు కుమార్తెల మృతదేహాలను వెలికితీశారు. అయితే అప్పటికే చీకటి పడటంతో మరొక వ్యక్తి జాడ తెలియలేదు. సోమవారం తెల్లవారుజామున తిరిగి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. విషయం తెలుసుకున్న జీకేవీధి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పంచనామా చేపట్టారు. ఈ ఘటనతో మృతుల బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..