పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. 100 బస్సులకు నడపాలని నిర్ణయించింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీకి అప్పగించింది. సుమారు 140 కోట్ల రూపాయలతో ఈ బస్సులను కొనుగోలు చేస్తున్నారు. ఒకసారి బ్యాటరీ రీచార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. బ్యాటరీ ఛార్జింగ్‌కు 3 గంటల సమయం పడుతుంది. దశలవారీగా ఏడాది కాలంలో ఈ వంద బస్సులను ఏపీ ప్రభుత్వానికి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ అందజేస్తుంది. తిరుపతితో పాటుగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరులో కూడా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Read: ట్రాఫిక్ కెమెరా ముందు ఫోజులిచ్చిన అనుకోని అతిథి… నెట్టింట్లో వైరల్…