శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతుంది. దాంతో ఈ సీజన్ లో ఐదవసారి రేడియల్ క్రేస్ట్ గెట్ అధికారులు ఎత్తారు. జలాశయం ఒక్క గెట్ 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో : 1,30,112 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో : 97,748 క్యూసెక్కులుగా ఉంది. ఇక పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత : 884.90 అడుగులుగా ఉంది. ఇక పూర్తిస్థాయి నీటి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవర్ హౌస్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పరిథిలోని పవర్ హౌస్‌లను కేఆర్ఎంబీకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం కుడి గట్టున ఉన్న పవర్ హౌస్‌ను, సాగర్ కుడి కాల్వ మీదున్న పవర్ హౌస్‌ను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. అయితే తెలంగాణ రాష్ట్రం తన పరిధిలోని పవర్ హౌస్‌లను అప్పగించాకే ఏపీ పవర్ హౌస్‌లను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని షరతు విధించింది.…
ప్రధాని నరేంద్ర మోడీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ చేతకానిపాలనతో దేశం మొత్తం అతలాకుతలమైందని ఆరోపించారు.. కేంద్రమంత్రి కొడుకు ఆశిష్ మిశ్ర రైతులపై కారు ఎక్కించి చంపేశారు… సీసీ కెమెరాల్లో కేంద్రమంత్రి కొడుకు అడ్డంగా దొరికితే ప్రధాని వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీశారు.. సుప్రీంకోర్టు స్పందిస్తే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా..? జైలులో కేంద్రమంత్రి కొడుక్కి రాజభోగాలా..? అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలోని వివిధ థర్మల్ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆరా తీశారు.. థర్మల్ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏపీ సీఎం.. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించిన ఆయన.. కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం…
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ్టి నుంచి అమల్లోకి రావాల్సిన సమయంలో.. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది.. అయితే, గెజిట్ ప్రకారం బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతపై స్పష్టత ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… అయితే, తన ప్రాజెక్టులను తెలంగాణ అప్పగించిన తర్వాతనే ఈ జీవో అమల్లోకి తేవాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. నోటిఫికేషన్ లోని రెండో షెడ్యూలు ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే, రివర్…
దేవాదాయశాఖ భూములని ఎవరు అక్రమించినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో తాగుబోతుల తరపున వకాల్తా పుచ్చుకున్న ఏకైక పార్టీ టీడీపీనే అంటూ ఎద్దేవా చేశారు. నిత్యావసరాల రేటు పెరిగితే ఆందోళన చెందాల్సిన ప్రతిపక్షం మందు రేట్లు పెరిగితే మాట్లాడడం కరక్టెనా…? అని ప్రశ్నించిన ఆయన.. మందు ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తానని సీఎం ముందే చెప్పారన్నారు. తెలుగుదేశం నాయకులు ఏం చేయాలో తెలియక…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,350 శాంపిల్స్ పరీక్షించగా.. 540 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 10 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ప్రకాశం జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, చిత్తూరులో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ఇదే సమయంలో 557 మంది…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడానికి తెరదింపాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించేలా కనిపించడంలేదు.. కేంద్రం నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించే పరిస్థితి కనిపించడంలేదు.. ఇవాళ్టి నుంచి గెజిట్ అమల్లోకి రావాల్సి ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోటాపోటీగా ఆసల్యం చేసేపనిలో పడిపోయాయి.. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది.. దీంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా పునరాలోచనలో పడిపోయింది. విద్యుత్ కేంద్రాలు, ఆఫ్ టేక్ ప్రాజెక్టులను తెలంగాణ అప్పగిస్తేనే.. ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియ మొదలుపెట్టాలని…
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. సమగ్ర భూ సర్వే పనుల్లో ప్రగతిని, లక్ష్యాలను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు.. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 51 గ్రామాల్లో సర్వే పూర్తి చేశామని.. డిసెంబర్ 2021 నాటికి మరో 650 గ్రామాల్లో కూడా సర్వే పూర్తి కానున్నట్టు సీఎంకు తెలిపారు.. ఇక, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం వైఎస్ జగన్..…