రేపు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్.. అభ్యర్థులపై ఉత్కంఠ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. తెలంగాణలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్‌రావు, ఎల్. రమణ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ రేసులో ముందున్నట్లు ప్రచారం జరగుతోంది. వీరితో పాటు మరికొంత మంది ఆశావహులు ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల 16న నామినేషన్ల దాఖలకు గడువు ఉండడంతో.. ఆలోపు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు.
రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి 103, మిత్రపక్షమైన ఎంఐఎంకు 7,మొత్తం కలిపి 110 ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్ ఆరు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అయితే ఒక ఎమ్మెల్సీకి పది మందికి పైగా ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆరు స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులే సునాయాసంగా ఏకగ్రీవం కానున్నారు. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 29న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కిస్తారు. ఎమ్మెల్సీలుగా చిన గోవిందరెడ్డి, మహ్మద్ షరీఫ్, సోము వీర్రాజు పదవీకాలం ముగియడంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఏపీలో ఎమ్మెల్సీ ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గోవింద్ రెడ్డికి హామీ ఇచ్చిన జగన్.. మరో ఇద్దరి అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. శాసనసభలో వైసీపీకి పూర్తి సంఖ్యా బలం ఉండటంతో.. ప్రకటించిన ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక కావటం లాంఛనమే.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..