ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద గల ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టమునకు 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఒక అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసరాల్లో ఏర్పడే అవకాశం ఉంది ,తరవాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా ఉత్తర తమిళనాడు తీరానికి నవంబర్ 11, 2021 ఉదయం నాటికి చేరుకుంటుంది. పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ ఆంధ్రా తీరము వద్ద సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నఉపరితల ఆవర్తనం ఇపుడు బలహీన పడింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ప్రధానము గా పొడి వాతావరణము ఉంటుంది. మరియు ఎల్లుండి ఉరుములు,మెరుపులుతో పాటు తేలికపాటి వర్షాలు లేదా జల్లులు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరియు ఎల్లుండి ఉరుములు మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ :
ఈరోజు, ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మరియు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.