రాయల చెరువుకు ఇంకా ప్రమాదం పొంచి ఉంది. చెరువుకు ఉత్తర భాగాన వాటర్ లీకేజీతో మరో గండి ఏర్పడింది గండి పూడ్చివేతకు అధికారులు చర్యలు చేపట్టారు. చెరువు లీకేజీతో 20 గ్రామాలకు ముప్పు ప్రమాదం ఉంది. చెరువు గరిష్ఠ నీటి మట్టం 0.6 టీఎంసీల కాగా, ప్రస్తుతం చెరువులో 0.9 టీఎంసీల నీరు ఉంది.నిన్నటి నుంచి దాదాపు 20వేలమంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిరుపతి శివారులో మూడు సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసారు అధికారులు. దగ్గరుండి ఏర్పాట్లు…
ఏపీలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కార్పోరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఛైర్ పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మున్సిపల్, నగర పంచాయతీల్లో ఛైర్ పర్సన్ ఎన్నికలు జరగనుండగా… మూడు మండలాల్లో ఎంపీపీ, 6 మండలాల్లో మండల ఉపాధ్సక్ష పదవులకు ఎన్నిక చేపట్టనున్నారు అధికారులు. ఇక విజయనగరం జెడ్పీ ఉపాధ్యక్ష పదవికి నేడే ఎన్నిక జరగనుంది. మొత్తం 130 పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు అధికారులు. అయితే ఈ ఎన్నికలో కొండపల్లి…
తిరుపతి రాయల చెరువు ప్రమాదకరంగా ఉంది. ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయం పై ఎన్టీవీతో స్పెషల్ ఆఫీసర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ… రాయల్ చెరువు పరిస్థితి క్రిటికల్ గా ఉంది. రాత్రి దేవుడు దయతో భయటపడాలీ అని కోరుకుంటున్నాం. మా ప్రయత్నాలు మేము వంద శాతం గండి పూడ్చానికి చేస్తాం. 0.9 టి.ఎం.సి నీళ్ళు రాయల్ చెరువులో ప్రస్తుతం వున్నాయి. గతంలో ఇంత కెపాసిటీ నీళ్ళు గతంలో ఏ చెరువుకు రాలేదు. కాబట్టి…
ఏపీలో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 24,659 శాంపిల్స్ పరీక్షించగా.. 174 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈరోజు కరోనా కారణంగా ఎవరు మరణించలేదు. ఇక, ఇదే సమయంలో 301 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,01,78,784 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,244…
అధికార వైసీపీ భీమవరంలో ప్రత్యేక పొలిటికల్ ఆపరేషన్ మొదలుపెట్టిందా? కుల సమీకరణాల ద్వారా పూర్తిస్థాయిలో పాగా వేయబోతుందా? ఎవరు ఎవరితో కలిసినా భీమవరాన్ని శత్రుదుర్బేధ్యం చేయాలని చూస్తోందా? వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పక్కాగా పావులు కదుపుతోందా? ఇంతకీ ఏంటా ఎత్తుగడలు? సైలెంట్‌గా భీమవరంలో వైసీపీ పొలిటికల్ ఆపరేషన్..! ఆపరేషన్ కుప్పం ద్వారా అధికార వైసీపీ చంద్రబాబు ఇలాకాలో ఏ విధంగా పాగా వేసిందో చూశాం. చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారే తప్ప.. అక్కడ పంచాయతీ, పరిషత్,…
టీడీపీ నేత కూన రవి కుమార్ కి శరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రాష్ట్రాన్ని వదిలివెల్లోద్దని కూనరవికుమార్ కి ఆదేశం ఇచ్చింది. అయితే కూన రవి కుమార్ మాట్లాడుతూ… భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కల్పిస్తున్నారు. కనీసం నోటీసు ఇవ్వకుండా… ఇంటి వద్దకు వచ్చారు. నేను ఏటువంటి నిరసనకు పిలుపు ఇవ్వలేదు. నన్ను ఏందుకు అడ్డుకుంటున్నారో కనీసం చెప్పలేదు . ఇప్పటికి మూడు తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పటికి పదిసార్లు పోలీసులు ఇష్టారాజ్యంగా ఇంట్లోకి…
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు పలువురు ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి మద్దతు తెలపగా… తాజాగా హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ కూడా టీడీపీ అధినేతకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఘటన గురించి మాట్లాడారు. శాసనసభలో జరిగిన ఘటన దురదృష్టకరమని సోనూసూద్ వ్యాఖ్యానించాడు. దేవాలయం లాంటి సభలో వైసీపీ నేతల వైఖరి సరికాదని సోనూసూద్ అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్…
టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 23 (మంగళవారం) నుంచి ఏపీలోని వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం కడప, మధ్యాహ్నం తిరుపతిలో చంద్రబాబు పర్యటించనున్నారు. బుధవారం నెల్లూరులో ఆయన పర్యటిస్తారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆయన పరామర్శించనున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై శనివారం నాడు టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్షించారు. Read Also: వరద బాధిత కుటుంబాలకు జగన్ శుభవార్త రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన…
ఏపీలోని వరద బాధిత కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త అందించారు. వరద ప్రభావిత జిల్లాలలో నిత్యావసర సరకుల పంపిణీకి ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళాదుంపలను ఉచితంగా సరఫరా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని వరద బాధితులకు…