జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు పరిధి నుంచి తప్పించుకోవడం కోసమే మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని అమరావతిలోనే ఉంటుందని జగన్ చెప్పారని.. ఈ మాట జగన్ అన్నారో లేదో వైసీపీ నేతలంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని సోము వీర్రాజు హితవు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు పెట్టేందుకు అసలు ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా…
మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ నిజంగా సంచలనమే. ఆందోళన చేస్తున్న రైతులు ఇది తమ విజయం అనుకున్నారు. ఈ చర్యను విపక్షాలు స్వాగతించాయి. బిల్లు ఉపసంహరణ హర్షణీయమని హర్షం వ్యక్తం చేశాయి. ఇది ఏడు వందల రోజుల పోరాట విజయం అన్నారంతా..కానీ, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువ లేదు. ఉపసంహరణపై సీఎం వివరణతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇది మోసం అంటూ ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లు ఉపసంహరణ ఏపీ సర్కార్…
రేపు ఉదయం 10:30కు కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక జరుగనుంది. కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ రేపే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌన్సిలర్లకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని తెలిపింది. నిన్న, ఇవాళ జరిగిన ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను అడ్డుకునేలా అధికార పార్టీ వ్యవహరించిందన్న పిటిషనర్ తరపు న్యాయవాది… వైసీపీ సభ్యులు కౌన్సిల్ హాల్లో చేసిన హంగామాకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కేశినేని నాని ఓటు…
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ హరిచందన్ డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని రోజుల కిందట జలుబు, దగ్గు వంటి లక్షణాలతో గవర్నర్ హరిచందన్ బాధపడుతుండటంతో అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా… కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. Read Also: బిగ్ బ్రేకింగ్…. ఏపీ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకున్న సర్కార్ మరోవైపు గవర్నర్ సతీమణికి కూడా కరోనా…
టూరిజానికి సంబంధించి ప్రత్యేక పాలసీ లేదు.త్వరలోనే సమగ్రమైన పాలసీని తీసుకువస్తామని… ప్రకటన చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ టూరిజంకి మంచి అవకాశాలున్నాయని… ఇప్పటికే శ్రీశైలం సింహాచలం త్వరలోనే అన్నవరం, ప్రసాదం స్కీం కింద నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. మహాయాన బుద్ధిష్ట్ సర్క్యూట్ ని అభివృద్ధి చేస్తామన్నారు. కాకినాడ, నెల్లూరులో, బీచ్ కోస్టల్ కారిడార్ అభివృద్ధి చేస్తామని… కేంద్ర పర్యాటక శాఖ…
ఏపీలోని జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. గత ఏడాది జనవరి 27న మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో గత 22 నెలలుగా ఈ తీర్మానం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు కేంద్రం నిర్ణయం రాకపోవడంతో తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని…
రాబోయే కాలంలో హీరోలే గెలుస్తారు గానీ, విలన్లు గెలిచే పరిస్థితి లేదు. మిగిలిన రెండున్నరేళ్లు జగన్ ప్రభుత్వానికి గడ్డుకాలమే అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. 2019 డిసెంబర్ లో మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రాష్ట్రంలో అల్లకల్లోలానికి నాంది పలికాడు. వేలాది మంది రైతులను, వారి కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేశారు. కోర్టులు మొట్టికాయలు వేస్తాయనే నిన్న ఉన్నపళంగా మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకున్నారు. సీఎం జగనుకు నిజంగా…
ఏపీలో బావికొండ బుద్ధిష్ట్ స్థావరాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… టూరిజానికి సంబంధించి ప్రత్యేక పాలసీ లేదు. త్వరలోనే సమగ్రమైన పాలసీని తీసుకువస్తాo. దీన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్ టూరిజం కి మంచి అవకాశాలున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం త్వరలోనే అన్నవరం, ప్రసాదం స్కీం కింద నిధులు మంజూరు చేస్తున్నం. మహాయాన బుద్ధిష్ట్ సర్క్యూట్ ని అభివృద్ధి…
శాసనసభలో వరద నష్టంపై ప్రకటన చేశారు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ 34 మంది మృతి చెందారని తెలిపారు మంత్రి కన్నబాబుజ అలాగే… మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటన చేశారు. భారీ వర్షాల కారణంగా 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని.. వరదలతో 5.33 లక్షల రైతులకు నష్టపోయారని వెల్లడించారు. నెల్లూరు, చిత్తూరు,కడప 10 కోట్ల రూపాయలు, అనంతపురం కలెక్టర్ల వద్ద…
హైకోర్టు నుంచి తప్పించుకోడానికి రాజధాని చట్టాలపై హడావిడి నిర్ణయమని… మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ఏపీ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని ఆగ్రహించారు జనసేన అధక్షుడు పవన్ కళ్యాణ్. హైకోర్టులో ఓటమి తప్పదని భావించే తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి బిల్లులను రద్దుకు ప్రభుత్వం ఉపక్రమించిందని నిప్పులు చెరిగారు. కోర్టు తీర్పుతో ఈ గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసిందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నర…