తిరుమల తిరుపతి దేవస్థానం మూడో ఘాట్ రోడ్డు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈరోజు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. తిరుమలకు రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. కాగా, ఇప్పుడు మూడో ఘాట్ రోడ్డును ఏర్పాటు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తున్నది. పదకవితా పితామహుడిగా పేరుగాంచిన అన్నమయ్య నడిచి తిరుమలకు చేరుకున్న అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయబోతున్నది. ఈ మార్గంలో ప్రయాణం చేస్తే తిరుపతికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా తిరుమలలోని తుంబూరు కోనకు చేరుతారు.
Read: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 100 మంది మృతి
రేణిగుంట మండలంలోని కరకంబాడీ-బాలపల్లి నుంచి ఈ మార్గం మొదలౌతుంది. ఈ మార్గం ద్వారా కడప జిల్లాకు చెందిన అనేకమంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటుంటారు. ఈ మార్గంలో శతాబ్దాల క్రితం యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన సత్రాలు దర్శనం ఇస్తుంటాయి. అయితే, ఈ మార్గంలో ఒంటరిగా వెళ్లడం శ్రేయష్కరం కాదు. అందుకే ఈ మార్గం అంతగా పాపులర్ కాలేదు. టీటీడీ ఈ మార్గాన్ని అభివృద్ది చేస్తే భక్తులు పెద్ద సంఖ్యలో ఈ మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే అవకాశం ఉంటుంది.