నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీ టాలీవుడ్‌కు ఊపిరి పోసిందని చిత్ర ప్రముఖులందరూ భావిస్తున్నారు. తాజాగా అఖండ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. అఖండ మూవీని తాను ఇటీవల చూసినట్లు చంద్రబాబు ఈరోజు ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన బాబు.. ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయనేది అఖండ సినిమాలో చూపించారని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారని… సినిమా చాలా బాగుందని చంద్రబాబు కితాబిచ్చారు.
Read Also: బాలీవుడ్ లోకి ‘అఖండ’.. హీరో అతడే..?
కాగా బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా హ్యాట్రిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు అఖండ కూడా వాటి సరసన నిలిచింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్న ఈ సినిమా రెండో వారంలోనూ సంతృప్తికర రీతిలో వసూళ్లు రాబడుతున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే బాలీవుడ్‌లో రీమేక్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.