ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. వీళ్లు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతుల మహాపాదయాత్రకు బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఆదివారం నాడు నెల్లూరు జిల్లాలో రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కావలి వద్ద అమరావతి రైతుల ఆధ్వర్యంలో బీజేపీ నేతలు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాజ్యసభ ఎంపీ…
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ-చెన్నై మార్గంలోని పడుగుపాడు వద్ద రైలుపట్టాలపైకి నీళ్లు చేరాయి. కాసేపటికే వరద ఉధృతి కారణంగా రైల్వేట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో పలు చోట్ల రైలుపట్టాలు గాల్లో వేలాడుతున్నాయి. Read Also: అలెర్ట్ : ఏపీలో…
వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్ మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం జగన్. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలి. అక్కడున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. పట్టణాల్లో పారిశుద్ధ్య పనుల, డ్రైనేజీల పూడికతీత పనులతో…
ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ మరియు దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3 . 1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాల మీద సగటు సముద్ర మట్టానికి 5 .8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. వీటి ఫలితం…
చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు… ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. ఏపీ – తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం అనంతరం.. సీఎం కేసీఆర్, సీఎం జగన్… తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహానికి హాజరయ్యారు. హైదరాబాద్ లోని శంషాబాద్ లో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాళి వివాహాం జరిగింది. అయితే…. ఈ శుభ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, సీఎం జగన్…ఇద్దరూ ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. అంతేకాదు… ఈ…
తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దాంతో టీటీడీ దర్శనాలు నిలిపివేసింది. అయితే ఈ వర్షాలతో టీటీడీ కి 4 కోట్లకు పైగా నష్టం వచ్చింది అని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. మొదటి ఘాట్ రోడ్డులో ఐదు ప్రాంతాలలో కోండ చరియలు విరిగిపడ్డాయి. రెండవ ఘాట్ రోడ్డులో 13 ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా…ఐదు ప్రాంతాలలో రక్షణ గోడ దెబ్బతింది అని అన్నారు. అలాగే నారాయణగిరి అతిథి గృహం వద్ద కోండచరియలు విరిగిపడడంతో మూడు గదులు…
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాల పట్ల తీవ్ర మనస్తాపం చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు బోరున ఏడ్చిన సంగతి తెలిసిందే. కనీసం మాటలు కూడా రాని స్థితిలో ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. గతంలో చంద్రబాబును ఆ స్థితిలో ఎప్పుడూ చూడని ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. చంద్రబాబు మీడియా సమావేశంలో విలపించడం చూసి ఓ చిన్నారి కూడా ఏడ్వడం ఆ వీడియోలో కనిపించింది. Read…
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడం లేదని పేర్కొంటూ అమలాపురానికి చెందిన న్యాయవాది రమేష్ చంద్రవర్మ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన కోర్టు… ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు.. ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.…