సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ రాశారు. గిరిజనులకు పథకాలు దూరం చేసే అడ్డగోలు నింబధనలు తొలగించాలని లేఖలో పేర్కొన్నారు నారా లోకేశ్. గిరిజనులకు నిలిపివేసిన పెన్షన్, రేషన్‌ను పునుద్దరించాలని కోరారు. 10 ఎకరాల భూమి, వాహనం ఉంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తెచ్చిన ఈ నిబంధనలు ఆదివాసీల పాలిట శాపంగా మారాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో చాలా మంది ఏడాది ఆదాయం 25 వేలు కూడా ఉండదన్నారు. గిరిజనులకు పథకాలను దూరం చేసే నింబధనలు తొలగించండని.. ఏపీ సీఎం జగన్‌కు రాసిన లేఖలో నారా లోకేశ్ పేర్కొన్నారు.
గిరిజనులకు సంక్షేమపథకాలు దూరం చేసే అడ్డగోలు నిబంధనలు సవరించి ..ఆపేసిన పెన్షన్, రేషన్, సంక్షేమపథకాలు పునరుద్దరించాలని సీఎం @ysjagan గారికి లేఖ రాసాను. మీకు ఓట్లు వేయడమే గిరిజనులు చేసిన పాపమా?(1/3) pic.twitter.com/1G9ijm4EMM
— Lokesh Nara (@naralokesh) December 10, 2021