జన్మనిచ్చిన తల్లిదండ్రులలే కొందరు భారంగా భావిస్తున్నారు.. కనీసం వారికి తిండి పెట్టి, బాగోగులు కూడా చూసుకోకుండా ఇళ్ల నుంచి వెళ్లగొడుతున్నారు.. వారు జీవితంలో సంపాదించింది, ఆస్తులు లాగేసుకోవడమే కాదు.. మమ్మల్ని కన్నారు, పెంచి పెద్దచేశారు, విద్యాబుద్ధులు నేర్పారు, వారిని మేం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? అనే జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంకా కొందరైతే చిత్రహింసలకు గురిచేసిన ఘటనలు ఎన్నో చూశాం.. ఇలాంటి పరిస్థితుల్లో జీవించడమే వ్యర్థమని ఇప్పటికే ఎంతో మంది పండుటాకులు రాలిపోయారు, ఆత్మహత్యలకు పాల్పడ్డారు.. తాజాగా, కాకినాడలో మహిళ జిల్లా ఎస్పీని కలిసి తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరడం సంచలనంగా మారింది.
Read Also: Virat Kohli: ధోనీ పుట్టినరోజుపై భావోద్వేగ ట్వీట్
గైగులపాడుకు చెందిన అచ్చియ్యమ్మ అనే మహిళ ఇవాళ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబును కలిశారు.. ఓ వినతి పత్రం సమర్పించారు.. తాను ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. తన కుమారుడు, కోడలు ప్రవర్తనపై విసుగు చెంది పోలీసులను ఆశ్రయించింది సదరు మహిళ.. అయితే, కాకినాడ రూరల్ గైగులపాడు గ్రామంలో అచ్చియ్యమ్మను ఇంట్లో నుండి చిన్నకుమారుడు, కోడలు గెంటివేసినట్టుగా తెలుస్తుంది.. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ… చనిపోవాలనే నిర్ణయానికి వచ్చింది.. ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఎస్పీని వేడుకుంటుంది.