YCP Plenary: వైసీపీ ప్లీనరీ సమావేశాల షెడ్యూల్ ఇదే.!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 8,9వ తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు వైసీపీ ప్లీనరీ అజెండా సిద్ధమైంది. మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. ఈనెల 8న ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10:10 గంటలకు పార్టీ జెండాను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించనున్నారు. ఉ.10:15 గంటల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్ధనలు జరగనున్నాయి. ఉ.10:30 గంటలకు దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సర్వమత ప్రార్థనలు జరుగుతాయి.
ఉదయం 10:55 గంటలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల కానుంది. ఈ ప్రకటనను పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేయనున్నారు. ఉ.11 గంటలకు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రారంభోపన్యాసం జరుగుతుంది. అనంతరం పార్టీ జమాఖర్చుల ఆడిట్ నివేదిక ప్రతిపాదన, ఆమోదం పొందుతాయి. ఆ తర్వాత పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదన, ఆమోదం ఉంటాయి. ఉ.11:35 గంటల నుంచి 11.45 నిమిషాల వరకు పార్టీ కార్యక్రమాలను నివేదిస్తారు. ఆ తర్వాత తీర్మానాలు ప్రారంభం అవుతాయి. ఉ.11:45 గంటలకు మహిళా సాధికారత దిశ చట్టం మొదటి తీర్మానం ఉంటుంది. ఈ తీర్మానంపై మంత్రులు ఉషశ్రీ చరణ్, రోజా , ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి ప్రసంగిస్తారు.
Also Read
- Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
- Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
- CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
- AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
Read Also: Nara Lokesh: ‘మీ విధానాలతో 42 వేల పాఠశాలలు 11 వేలకు తగ్గిపోతాయి’
రెండో అంశంగా మధ్యాహ్నం ఒంటిగంటకు విద్యపై తీర్మానం జరుగుతుంది. ఈ అంశంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సుధాకర్ బాబు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడతారు. మధ్యాహ్నం 2:15 గంటల నుంచి పావు గంట పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌పై తీర్మానం ప్రవేశపెడతారు. ఈ తీర్మానంపై మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, ఎమ్మెల్యేలు కొత్తగుళ్ళి భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3:15 గంటలకు వైద్యంపై తీర్మానం ప్రవేశపెడతారు. ఈ తీర్మానంపై మంత్రులు విడదల రజిని, సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని మాట్లాడతారు. సాయంత్రం 4:30 గంటలకు పరిపాలనా- పారదర్శకత అంశంపై చర్చ జరుగుతుంది. ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, పార్థసారథి ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలతో మొదటిరోజు ప్లీనరీ సమావేశం ముగుస్తుంది.
తాజావార్తలు
-
Ram Charan : చరణ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. కానీ?
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
-
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Karan Johar : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3కి కరణ్ జోహార్ ప్లాన్
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!