Botsa Satyanarayana: వాళ్లు విలీన మండలాలు అడిగితే.. రెండు రాష్ట్రాలను మళ్లీ కలపాలని మేం డిమాండ్ చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana comments on polavaram project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పోలవరం ఎత్తు ఎవరు పెంచారని పువ్వాడ అజయ్‌ను ప్రశ్నించారు. డిజైన్ల ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని.. దాన్ని ఎవరూ మార్చలేదన్నారు. భద్రాచలం ముంపు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తావించారని గుర్తుచేశారు. విభజన చట్ట ప్రకారమే అంతా జరుగుతోందని బొత్స వ్యాఖ్యానించారు. వందేళ్ల తర్వాత మొదటిసారి ఈ నెలలో గోదావరికి ఇంత పెద్దఎత్తున వరద వచ్చిందని.. పోలవరం వల్ల కాదని స్పష్టం చేశారు.
Read Also: Puvvada Ajay: పోలవరం ఎత్తు తగ్గించి.. ఆ మండలాలు మళ్ళీ కలపాలి
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
రాష్ట్రవిభజన వల్ల హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందని.. అలాగని హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయమని అడగగలమా అని బొత్స సూటి ప్రశ్న వేశారు. వాళ్లు విలీన మండలాలు కలపాలని డిమాండ్ చేస్తే.. రెండు రాష్ట్రాలను మళ్లీ కలపాలని తాము డిమాండ్ చేస్తామన్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిపేస్తే ఎవరికీ ఇబ్బంది లేదు కదా అని బొత్స అభిప్రాయపడ్డారు. విలీన మండలాలు కలిపేయాలని మాట్లాడటం సరికాదన్నారు. సమస్యల పరిష్కారమే ఇప్పుడు ముఖ్యమన్నారు. కొందరు వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాల్సి ఉందన్నారు. సీఎం అయినా, మంత్రులైనా బాధ్యతగానే మాట్లాడాలని హితవు పలికారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరికాదని బొత్స అన్నారు. పువ్వాడ అజయ్ ఆయన సంగతి ఆయన చూసుకోవాలని సూచించారు. ముంపు మండలాల బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాల సంగతి ఆయన చూసుకుంటే సరిపోతుందన్నారు. ముంపు మండలాల ప్రజలు ఏపీ రాష్ట్ర కుటుంబ సభ్యులు అని.. వారి సంగతి మేం చూసుకుంటామని బొత్స అన్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!