కష్టకాలంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడొద్దు అంటూ పార్టీ సినియర్ నేతలకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు.. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సీనియర్ నేతగా ఉన్న గులాంనబీ ఆజాద్ పార్టీని వీడడం దురదృష్టకరం అన్నారు.. ఆజాద్ సహనం పాటించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని సీనియర్లు వీడకూడాదని విజ్ఞప్తి చేసిన ఆయన..…
ఏ కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు.. అక్కడైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంటుంది.. ఏం జరిగినా.. మొదటగా వచ్చేవాళ్లు కూడా పోలీసువాళ్లే.. అయితే, అందులో కొందరు తప్పుడుదార్లు తొక్కడంతో.. మొత్తం డిపార్ట్‌మెంట్‌కే మచ్చగా మారుతున్న ఘటనలు ఉన్నాయి.. ఓ ఏఎస్ఐ రక్షభట నిలయాన్ని తన పడక గదిగా మార్చుకుని అడ్డంగా దొరికిపోయాడు… డ్యూటీలో ఉన్న సమయంలో మద్యం సేవించడమే కాదు.. ఏకంగా ఓ మహిళను పోలీస్ స్టేషన్‌కే తీసుకుని వచ్చి రాసలీలలు సలిపాడు..…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టారు.. అందులో భాగంగా.. పర్యాటక శాఖపై ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగనున్న సమావేశానికి.. ఆ శాఖ మంత్రి ఆర్కే రోజా, ఆ శాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.. ఇక, అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త కూడా చెప్పబోతున్నారు.. ఎందుకంటే.. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారంభంకానున్నాయి.. కరోనా మహమ్మారి…
Face Recognisation App: సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ పేరుతో ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాల్లోని పలువురు టీచర్లు సిద్ధం అవుతున్నారు. అయితే టీచర్ల హాజరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వారిని ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ యాప్ ద్వారా ఆందోళనల్లో పాల్గొనే టీచర్లను గుర్తు పట్టే ప్రయత్నాల్లో నిఘా వర్గాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.…
Andhra Pradesh: ఈనెల 31న వినాయకచవితి పండగ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా వినాయకుడి మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేయాలంటే అధికారులు ప్రత్యేకంగా రుసుము వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ స్పందించారు. రాష్ట్రంలో వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని వివరణ ఇచ్చారు. వినాయక చవితి మండపాలు ఏర్పాటు…
కడప నగరానికి సమీపంలోని వైఎస్ఆర్ లేఅవుట్లో పాలు అమ్ముకుని జీవించే సాత్విక అనే వివాహిత గత ఆదివారం ఓ కామాంధుడి చేతిలో దాడికి గురైంది. ఉదయం పాలు పోసి వస్తుండగా అదే కాలనీకి చెందిన కిరణ్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి లోనై ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు కిరణ్. ఈ ఘటనలో సాత్వికకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన…
టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అనడానికి నిదర్శనం కుప్పం.. చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం పోయింది.. ఆయన జెండాను, పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు మంత్రి జోగి రమేష్… 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు ఏ వర్గానికి అయినా మేలు చేశాడా..? అని ప్రశ్నించిన ఆయన.. 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు మాకు చంద్రబాబు ఏమీ చేశాడు అని ప్రజలు తిరుగుబాటు చేశారు.. ఆ తిరుగుబాటు కుప్పంలో బీసీల నుంచే ప్రారంభం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు మంత్రి జోగి రమేష్… పవన్ కల్యాణ్‌కు కథ, స్క్రీన్ ప్లే టీడీపీ అధినేత చంద్రబాబు అయితే, డైరెక్షన్ నాదెండ్ల మనోహర్ అని పేర్కొన్న ఆయన… కేఏ పాల్కి, పవన్ పాల్కి తేడా లేదు… ఇద్దరికీ ఆంధ్రప్రదేశ్‌లో సీట్లు లేవు అంటూ ఎద్దేవా చేశారు.. జాకీలు పెట్టీ లేపిన లేవలేని చంద్రబాబుని నువ్వు మోయగలవా అంటూ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు జోగి రమేష్.. చంద్రబాబు నువ్వు…
ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌పై కూడా ఫోకస్ పెడుతోంది భారతీయ జనతా పార్టీ.. గతంలో పోలిస్తే.. ఇప్పుడు రెగ్యులర్‌గా ఏదో ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తూనే ఉంది.. ఆ పార్టీ అగ్రనేతలు.. ఈ మధ్య వరుసగా టాలీవుడ్ ప్రముఖ హీరోలను కలవడం పొలిటికల్ హీట్ పెంచుతుంది.. ఇవాళ రాజమండ్రిలో పర్యటించిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రాంతీయ పార్టీలు ఓబీసీలను ఓటు బ్యాంక్ గా మాత్రమే ఉపయోగిస్తున్నారని…