విపక్షాలు ఎన్ని పగటి వేషాలు వేసినా.. సీఎం కుర్చీని దక్కించుకోలేరు అంటూ వ్యాఖ్యానించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి… నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మళ్ళ దిబ్బ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను వివరిస్తూ.. విపక్షాల తీరుపై ధ్వజమెత్ఆరు.. విపక్షాలు ఎన్ని పగటి వేషాలు వేసినా.. సీఎం కుర్చి దక్కించుకోలేరని స్పష్టం చేశారు.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు హైదరాబాదులో ఉంటూ.. విజయవాడకి అల్లుళ్ల లాగా వచ్చి పోతున్నారని ఆరోపించిన ఆయన.. 600 వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని.. అందుకే మళ్లీ ఆయన్ని ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు.. ఇక, నందమూరి తారక రామారావును మోసగించిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించారు.. ఎన్టీఆర్ పై చెప్పులు వేసి అవమానించారు.. ఎన్నికల సమయంలో మాత్రమే ఎన్టీఆర్, కార్యకర్తలు చంద్రబాబుకు గుర్తుకు వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
Read Also: Kuppam Crime: అనైతిక బంధం.. రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య..!