TTD: తిరుమలలో ఇవాళే గరుడ సేవ.. భక్తులకు కీలక సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోవ రోజు శ్రీవారు ఉదయం మోహిని అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు.. ఇక, బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ సేవ ఈ రోజే జరగనుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. ఇవాళ తిరుమలకు రానున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లలిత్.. శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొననున్నారు.. ఈ వాహన సేవకు వచ్చే భక్తులందరికి దర్శనభాగ్యం కల్పించేందుకు పటిష్టచర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం.. భక్తులందరికీ వాహన దర్శనం కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాటు చేసినట్లు చేసింది.. తిరు మాడ వీధుల్లో హారతి పాయింట్లు, గ్యాలరీలను ఈవో, డీఐజి రవి ప్రకాష్, జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డితో కలిసి ఇప్పటికే పరిశీలించారు.. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది భక్తులకు శ్రీవారి గరుడ వాహన దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఇక, ఈ ఏడాది సౌత్ వెస్ట్ గేటు, నార్త్ వెస్ట్ గేటు, నార్త్ ఈస్ట్ గెట్ల వద్ద ఉన్న హారతి పాయింట్లలో హారతులకు బదులు భక్తులను స్వామి వారి వాహన సేవకు అనుమతించనుంది టీటీడీ.
Read Also: APPSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
గరుడ సేవ కారణంగా ట్రాఫిక్ నియంత్రణా చర్యలు చేపట్టారు టీటీడీ అధికారులు. ఘాట్ రోడ్లలో రేపు మధ్యహ్నం వరకు ద్విచక్రవాహనాలు నిలిపివేస్తూ నిర్ణం తీసుకున్నారు.. నిన్నటి నుంచి అంటే సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరుమలకు బైక్‌లు నిషేధించారు. అలాగే వాహనదారులు అంతా తిరుపతిలో నిర్దేశించిన అలిపిరి బస్ స్టాండ్ పాత చెక్ పెయింట్ ఇస్కాన్ గ్రౌండ్, మెడికల్ కాలేజి గ్రౌండ్, నెహ్రు మున్సిపల్ గ్రౌండ్‌లలో పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇవాళ తిరుమలకు వెళ్లే వాహనాలు ముందుగా ప్రీ పాసులు పోందాలని సూచించారు పోలీసులు.. తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ గరుడవాహన దర్శనభాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. గ్యాలరీల ద్వారా 2 లక్షల మంది భక్తులుకు.. హారతి పాయింట్ల వద్ద హరతులు రద్దు చేసి.. భక్తులును దర్శనానికి అనుమతించడం ద్వారా మరో 30 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలగనుంది.. ఇక, శ్రీవారి ఆలయం ఎదుట గ్యాలరీల రీఫిల్లింగ్ ద్వారా మరో 25 వేల మంది భక్తులకు స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించే ఏర్పాట్లు చేసింది టీటీడీ.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!