వినాయక చవితి వచ్చేసింది.. ఇప్పటికే గల్లీలు, విధులు, ఊరు, వాడ అనే తేడా లేకుండా గణేష్ మండపాలు వెలుస్తున్నాయి.. మరికొన్ని చోట్ల.. మండపాల ఏర్పాటుకు, విగ్రహాలు పెట్టేందుకు అధికారులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ అనుమతుల కోసం తిరాగాల్సిన పరిస్థితి ఉంది.. ఈ పరిణామాలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త సీరియస్‌గా స్పందించారు.. నీ విగ్రహాల ఏర్పాటుకు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయిస్వామి అంటూ ఆ గణపతిని వేడుకున్నాడు.. ఏ విషయంపైనానా ముక్కుసూటిగా,…
శ్రీ సత్య సాయి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ నేత సభ్యసమాజం సిగ్గుపడేలా చేశాడు.. బుక్కపట్నం మండలం కృష్ణాపురంలో పదహారేళ్ల బాలికలను పెళ్లి చేసుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ కమిటీ అధ్యక్షడు.. ఆయన వయస్సు 62 ఏళ్లు.. బాలికకు దయ్యం పట్టిందని ముందుగా నమ్మించిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత క్షుద్ర పూజలు నిర్వహించాడు.. ఆ తర్వాత తన వల్లే నయమైందని బాధితురాలి తల్లిదండ్రులను నమ్మించి.. తన అసలు రంగును బయటపెట్టాడు.. ఆ…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రతిష్టాత్మక “ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం లభించింది. పర్యావరణ హితాన్ని కోరుతూ లక్షా 24 వేల మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికి అందించడంలో విశేష కృషి చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ అవార్డుకు అర్హత సాధించారు. తిరుపతి రూరల్ పరిధిలోని చిగురువాడ అకార్డ్ స్కూల్ అవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..…
* నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు * ఆసియాకప్‌లో నేడు పాకిస్థాన్‌తో తలపడనున్న భారత్, దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * నేడు హైదరాబాద్‌లో 11వ ఎడిషన్ మారథాన్.. నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వరకు మారథాన్, హైదరాబాద్ రన్నర్స్, ఎన్ఎండీసీ, ఐడీఎఫ్సీ ఆధ్వర్యంలో నిర్వహణ, మారథాన్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు, 42 కిలోమీటర్ల మేర కొనసాగనున్న ఫుల్ మారథాన్ * నేడు తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష, ఉదయం…
Minister PeddiReddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. అభివృద్ధి చేసుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నించారు. కోల్లుపల్లెలో వైసీపీ నేతలపై దాడి చేసింది టీడీపీ నేతలేనని.. వైసీపీ జెండాలను కట్టెలతో తొలగించింది టీడీపీ వాళ్లేనని మంత్రి పెద్దిరెడ్డి మీడియాకు వీడియోలు చూపించారు. 33 ఏళ్ళలో ఎన్నిసార్లు…
బాపట్ల జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో బెల్ట్ షాపు నిర్వహణ, నాటుసారా అమ్మకాలకు వేలంపాట నిర్వహించారు. అయితే గ్రామంలోని అధికారులు ఈ వేలంపాట నిర్వహించిన విధానం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. గ్రామంలోని ఓ ఆలయంలో వేలంపాట నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లిక్కర్ షాపు కోసం ఆలయంలో వేలం పాట నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో లిక్కర్ షాపు కోసం వేలం పాట పెట్టి ఓ వర్గాన్ని అవమానపరిచారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వేలం పాటలో…
Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం తరహాలో ఏపీలో మరో ప్రాంతంలోని ప్రజలు కిడ్నీ వ్యాధితో అల్లాడిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండల వాసులు కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కిడ్నీ వ్యాధితో 35 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క ఈ నెలలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. చీమలపాడు, దీప్లానగర్, చైతన్య నగర్, మాన్ సింగ్ తండా, రేపూడి తండా, కంభంపాడు, లక్ష్మీపురం, పెద్దతండా సహా…
What’s Today: • ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ • విశాఖలో నేడు మంత్రి మేరుగు నాగార్జున పర్యటన.. మధురవాడలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని సందర్శించనున్న మంత్రి నాగార్జున • విజయవాడ: నేడు 58వ డివిజన్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు • పల్నాడు జిల్లా: నేడు నాదెండ్ల మండలం సాతులూరులో గడపగడపకు మన ప్రభుత్వ…
Minister Roja: రాజమండ్రిలో శుక్రవారం నాడు పర్యాటక శాఖ మంత్రి రోజా పర్యటించారు. వీఎల్ పురంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిప్పటి నుంచి చంద్రబాబులో వణుకు మొదలైందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మరోవైపు బాలకృష్ణ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించి ఆ రథంపై కేవలం ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలనే ముద్రించుకున్నారని.. చంద్రబాబు ఫోటో…