విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన, ప్రియుడిని పెళ్లాడి ప్రత్యక్షమైన సాయిప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది… భర్త కన్నుగప్పి ప్రియుడితో వెళ్లిపోయింది సాయిప్రియ.. కానీ, ఆ విషయం తెలియన ఆమె భర్త శ్రీనివాస్.. తన భార్య సముద్రంలో గల్లంతయ్యిందని భావించిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో, పోలీసులు, నేవీ, సముద్రతీరంలో గస్తీ దళం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.. కానీ, పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.. ప్రియుడితో వెళ్లిపోయిన ఆమె.. అతడిని పెళ్లి…
కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరదతో విజయవాడకు ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద తరలివస్తోంది. దీంతో.. మరోసారి ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉదృతి నెలకొంది. బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 3,27,692 క్యూసెక్కులు కాగా.. కాలువలకు 14,692 క్యూసెక్కుల వరదనీరు తరలించారు. బ్యారేజ్ లెవల్ 12.0 కు చేరింది. 20 గేట్లను 8 అడుగుల మేర, 50 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.…
CPS Employees: సెప్టెంబర్ 1న సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడ వాయిదా పడింది. ఈ మేరకు ఏపీసీపీఎస్ఈఏ ఉద్యోగులు ఓ ప్రకటన జారీ చేశారు. APCPSEA ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా సెప్టెంబర్ 1వ తేదీన శాంతియుత ర్యాలీ, సభల ద్వారా సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నామని తెలిపారు. ఈ శాంతియుత నిరసన కార్యక్రమాలకు ప్రతిసారి పోలీసు అనుమతి తీసుకుని నిర్వహిస్తూ వచ్చామని.. అలాగే సెప్టెంబర్ 1న చలో విజయవాడ పేరుతో నిర్వహించబోయే…
CM Jagan: సెప్టెంబరు 3న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నేతృత్వంలో సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్ శర్మ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి సీఎం జగన్ గైర్హాజరు కానున్నారు. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి నేపథ్యంలో ఆయన దూరం కానున్నట్లు తెలుస్తోంది.…
Kottu Satyanarayana: ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఫైర్ సేఫ్టీ కోసం రూ.500, మైక్ పర్మిషన్ కోసం రోజుకు రూ.100 చలానా రూపంలో కట్టాలని.. ఈ నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయని.. కొత్తగా పెట్టిన నిబంధనలు కాదని స్పష్టం చేశారు. కేవలం నగరాలు, పట్టణాలకు మాత్రమే గణేష్ మండపాల ఏర్పాటుకు ఈ నిబంధనలు వర్తిస్తాయని.. గ్రామాల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదని తెలిపారు. దేవుడితో చెలగాటం…
ఆంధ్రప్రదేశ్‌కు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది చెప్పేందుకు నేను సిద్ధం.. దీనిపై ఎవరు చర్చకు వస్తారో రావాలని సవాల్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు సోమువీర్రాజు.. ఈ సందర్భంగా.. అమరావతి రైతులు ఆయన్ను కలిశారు.. అమరావతి రైతులు పాదయాత్రకు ఆహ్వానించారు.. రైతులకు అండగా నిలుస్తున్న బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు అమరావతి జేఏసీ నేతలు.. అయితే, ఏపీలో వినాయక చవితికి…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షంలో.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మంగళగిరికి చెందిన కీలక నేత గంజి చిరంజీవి.. 20 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన చిరంజీవి.. ఇవాళ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.. మరికొందరు ముఖ్యనేతలతో కలిసి సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా.. సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు.. పార్టీ కండువా కప్పి గంజి…
సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న చలో విజయవాడకు పిలుపునిచ్చాయి ఉద్యోగ సంఘాలు.. అయితే, ఈ కార్యక్రమాన్ని అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసులు.. గతంలో విజయవాడలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రభుత్వం పటిష్ట చర్యలకు సిద్ధం అవుతోంది.. ఇక, నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం అయ్యారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీతో సీఎం సమీక్ష నిర్వహించారు.. సెప్టెంబర్ 1వ తేదీన ఛలో విజయవాడకు…
పండుగల సీజన్ వచ్చేస్తోంది.. ఒక్కరోజు దాటితే వినాయక చవితి.. ఆ తర్వాత దసరా.. ఇలాంటి సమయంలో.. పువ్వుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.. పండుగల సీజన్ దగ్గర పడటంతో మార్కెట్ లో పువ్వుల ధరలు మండిపోతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గతం కంటే రొండు రేట్లు అధిక ధరలకు వ్యాపారాలు పువ్వులు అమ్ముతున్నారని చెబుతున్నారు.. కేజీ మల్లెలు, సన్నజాజి పువ్వులు రూ. 400గా పలుకుతుండగా… చామంతి పువ్వులు కేజీ 250 రూపాయల పైమాటే అంటున్నారు.. ఇక, కనకాంబరం…
తెలుగుదేశం పార్టీలో కీలకనేతగా ఉన్న మంగళగిరికి చెందిన గంజి చిరంజీవి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆశిస్తున్న ఆయన.. గత ఎన్నికల్లో నారా లోకేష్ అక్కడి నుంచి పోటీ చేయడంతో.. ఆ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది.. ఇక, లోకేష్ మంగళగిరిపై కేంద్రీకరించి పనిచేయడంతో.. తనకు ఆ స్థానం దక్కే అవకాశం లేకపోవడంతో.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. కానీ, ఏ పార్టీలో చేరతారు అనేది మాత్రం స్పష్టం చేయలేదు.. కానీ,…