Plastic Ban: విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విశాఖలో శుక్రవారం నిర్వహించిన ‘సాగర తీర స్వచ్ఛత’ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర తీరంలో 20వేల మందితో 28కి.మీ. మేర బీచ్ క్లీనింగ్ చేపట్టి 76 టన్నుల ప్లాస్టిక్‌ను తొలగించామని తెలిపారు. అటు ఏపీలో ఈరోజు నుంచే ప్లాస్టిక్ బ్యానర్లు రద్దు చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఇకపై క్లాత్ బ్యానర్లు మాత్రమే కనిపించాలని సూచించారు. విశాఖ…
Andhra Pradesh Schools: ఏపీలో స్కూల్ విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు శుభవార్త అందించారు. ఆగస్టు 27న శనివారం నాడు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రెండో శనివారమైన ఆగస్టు 13న విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు వచ్చిన నేపథ్యంలో.. ఆగస్టు 13కు బదులుగా ఆగస్టు 27ను సెలవుదినంగా ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్ల కోసం ఆగస్టు 13న అన్ని స్కూళ్లు…
What’s Today: • నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన.. పార్లే సంస్థ, ఏపీ మధ్య బీచ్ క్లీనింగ్, రీ సైక్లింగ్ ప్లాస్టిక్ వినియోగంపై ఎంవోయూ కుదర్చుకోనున్న జగన్.. అనంతరం ఏయూ కాన్వకేషన్ సెంటర్‌కు వెళ్లి మైక్రోసాఫ్ట్ పట్టాల పంపిణీలో పాల్గొననున్న సీఎం జగన్ • నేడు కుప్పంలో చంద్రబాబు మూడోరోజు పర్యటన.. ఆర్ అండ్ బి బంగ్లాలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న చంద్రబాబు • నేడు రాజమండ్రిలో మంత్రి రోజా పర్యటన..…
సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖలో పర్యటించనున్నారు.. ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి బీచ్ వరకు 25వేల మందితో 25 కిలోమీటర్ల మెగా క్లీనప్ డ్రై వ్ లో పాల్గోనున్నారు. నగరానికి మణిహారమైన సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు తొలగింపును యజ్ఞంగా చేపట్టింది విశాఖ జిల్లా అధికార యంత్రాంగం.. 25వేల మంది భాగస్వామ్యంతో… 25కిలోమీటర్ల పొడవున మెగా బీచ్ క్లీనప్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రయత్నం గిన్నీస్ రికార్డ్ నెలకోల్పో దిశగా జరుగుతోంది. ఫిషింగ్…
తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది.. పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం, వాగ్వాదం, దాడుల వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, కేసుల పరంపర కూడా కొనసాగుతోంది.. అయితే, కుప్పంలో జరిగిన పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు చంద్రబాబు నాయుడు.. అన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై దాడులా..? ఇదేం రాజకీయం..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. కుప్పంలో కొత్త సంస్కృతి కోసం…
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ను సందర్శించింది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) టీమ్… ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఎన్ఎస్జీ ఐజీ సిమిర్దీప్ సింగ్ నేతృత్వంలోని టీమ్.. టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించింది.. ఆఫీసులోని ప్రతీ గదిని పరిశీలించారు.. అంతే కాదు.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని కూడా పరిశీలించారు.. నివాసంలోని ప్రతీ గదిని వారు పరిశీలించినట్టుగా చెబుతున్నారు. చంద్రబాబు భద్రతపై తాము ఆందోళన వ్యక్తం చేస్తూ గతంలోనే కేంద్రానికి ఫిర్యాదు చేశామని తెలిపాయి టీడీపీ…
లక్ష్మీపార్వతి అడిగారనో.. నేను అడిగాననో.. జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోరన్నారు కొడాలి నాని.. ఆయనకి అవకాశం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు, తీసుకోగలను అనుకున్నప్పుడు.. తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా తీసుకుంటారని.. దానికి తొందరెందుకు అని వ్యాఖ్యానించారు.
వైసీపీ విముక్త ఏపీ అని అంటున్నారు.. అంటే పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం ఏమీ ఉండకుండా చేయటమే తన లక్ష్యం అని చెప్పినట్టే అన్నారు.. ఇలా తెలిసే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారో... ఎవరైనా చెబితే చేస్తున్నారో? అని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రధాన నరేంద్ర మోడీని కలిసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు… ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాలని ఆహ్వానించారు.. ఈరోజు ఆయన కార్యాలయంలో ప్రధాని మోడీని కలిశారు రాజ్యసభ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు… అనేక ప్రతిష్టాత్మకమైన జాతీయ అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పర్యటనకు రావాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్బంగా ప్రధానికి జీవీఎల్ స్వయంగా అందచేసిన లేఖలో విశాఖపట్నంలో పూర్తికానున్న పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రస్తావించారు.. వాటిపై ప్రధాని…