తెలంగాణ మంత్రి హరీష్‌రావు… తాజాగా ఏపీ సర్కార్, అక్కడి టీచర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హాట్ కామెంట్లు చేశారు.. అయితే, హరీష్‌రావు కామెంట్లపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్ర ఆదాయాలు తక్కువగా ఉన్నా అద్భుతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు.. మా రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత హరీష్ రావుకు, కేసీఆర్‌కు లేదన్న ఆయన… తమ రాష్ట్రంలో బలహీనం అయిపోతున్నారా..? అని ప్రశ్‌నించారు.. అంతేకాదు, రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు హరీష్ రావు సిద్ధమా? అంటూ బహిరంగ సవాల్ విసిరారు అంబటి…
Read Also: Ambati Rambabu: మళ్లీ మళ్లీ చెబుతున్నా.. అది కొవ్వు ఎక్కిన కోటీశ్వరుల పాదయాత్ర..
ఇక, రాజకీయాల్లో వారసత్వం ఉండదు.. ప్రజల మద్దతు లేకుండా కేవలం వారసత్వంతోనే రాజకీయాల్లో రాణిస్తాం అనుకుంటే పొరపాటేనని హితవుపలికారు మంత్రి అంబటి రాంబాబు… నారా లోకేష్ పరిస్థితే దీనికి ఉదాహరణ అని ఎద్దేవా చేసిన ఆయన.. అందుకే లోకేష్ ను చంద్రబాబు దొడ్డి దారిన మంత్రిని చేశాడని ఆరోపించారు.. మరోవైపు, రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు అంబటి రాంబాబు.. కాగా, తెలంగాణలో ఐదేళ్లలో ఉపాధ్యాయులకు 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని తెలిపిన మంత్రి హరీష్‌రావు.. జీతాలు కొంచెం లేట్ అవుతున్న మాట వాస్తవమే అన్నారు.. ఇదే సమయంలో.. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తుందని హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.