అమరావతి రైతుల పాదయాత్రపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు… ఇది రైతుల పాదయాత్ర కాదు.. ఒళ్లు బలిసినవాళ్లు చేస్తున్న పాదయాత్ర అని చెప్పాను.. ఇదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నా… కొవ్వు ఎక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అది అంటూ మండిపడ్డారు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కడుపు మండిన వారు పాదయాత్ర చేస్తే చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.. చంద్రబాబు మూల్యం చెల్లించకోక తప్పదు.. యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది అని హెచ్చరించారు..
Read Also: Police: శ్రీకాళహస్తి సీఐ ఓవర్ యాక్షన్.. నడి రోడ్డుపై చీర ఊడిపోయేలా మహిళను కొట్టి..!
ఇక, పోలవరం సర్వనాశనం అయిపోవాలని చంద్రబాబు కోరిక అంటూ మండిపడ్డారు అంబటి రాంబాబు… రాష్ట్రం శ్రీలంకలా అయిపోవాలని ఆయన కోరిక అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి… కానీ, తమ తాబేదార్లు ఉన్న అమరావతి మాత్రం దేదీప్యమానంగా వెలిగి పోవాలని కోరుకుంటారని ఎద్దేవా చేశారు.. మరోవైపు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేయలేక పోతున్నారు? అని నిలదీశారు.. టీడీపీ ప్రజాప్రతినిధులకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదా? అని నిలదీశారు.. ఇక, పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ప్రమాదం… భద్రాచలమే మునిగి పోతుందని తెలంగాణ చేసిన వాదన కరెక్ట్ కాదని కొట్టిపారేశారు మంత్రి అంబటి రాంబాబు. కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా తమ తమ నియోజకవర్గాల్లో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ఈ మధ్యే సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్… ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనని మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు.