CM Jagan: సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు ఆయన కడప జిల్లాలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2:20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:20 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరనున్నారు. మధ్యాహ్నం 3:50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల…
AP Crime News: భార్యకు టిఫిన్ తీసుకువచ్చేందుకు వెళ్లిన భర్త దాదాపు 45 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చే సమయానికి గుర్తు తెలియని వ్యక్తి ఇంటి నుంచి పరారవుతున్నాడు. భయాందోళనలతో ఏం జరిగిందో ఇంట్లోకి వెళ్లి చూడటంతో రక్తపు మడుగులో మృతి చెంది పడి ఉన్న భార్య కనపించటంతో పోలీసులకు సమాచారం అందించాడు భర్త. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన దోపిడీ ఘటనతో పట్టణమంతా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. మహిళ హత్య కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్‌ను…
Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా సెప్టెంబర్ 1న 62.70 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ జరగనుంది. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1,594.66 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. రాష్ట్రంలోని 2.66 లక్షల మంది వలంటీర్లు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఐదు రోజుల్లోగా వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పింఛన్ల అందజేతలో అక్రమాలకు తావులేకుండా అధికారులు బయోమెట్రిక్, ఐరిస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కాగా అర్హులైన ప్రతి ఒక్కరికీ…
Chandra Babu: ఏపీలో వినాయకచవితి ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. వినాయక చవితి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదని చంద్రబాబు పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రజలను ఏకం చేసి.. వారిలో జాతీయ భావాన్ని నింపేందుకు దోహదపడిన ఒక సామాజిక స్ఫూర్తి అని.. అటువంటి గణేష్ ఉత్సవాలపై అనుమతుల పేరుతో ఆంక్షలు సరికాదని ఈ సందర్భంగా…
Andhra Pradesh: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను సేవ్ దేశీ కౌస్ క్యాంపెయినర్, క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ దేశవాళీ అవులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, కృత్రిమ గర్భధారణ పద్దతుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సేవ్ దేశీ కౌస్ ప్రచారంలో భాగంగా ఆమె సీఎం జగన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం గోమయ గణపతి ప్రతిమను అందజేశారు. అంతేకాకుండా దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం…
Somu Veerraju: ఏపీలో వినాయక చవితి పండగ సందర్భంగా ఆంక్షలు విధించారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితికి ప్రభుత్వం విధించిన ఆంక్షలు యావత్ ఆంధ్ర ప్రదేశ్ నివ్వెరపోయేలా ఉన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం వినాయక చవితికి పందిరి వేసుకుంటే ఫైర్, విద్యుత్, పోలీసుల పర్మిషన్ కావాలని.. చందాలు అడగాలన్నా పర్మిషన్ కావాలని, అసలు ఈ ప్రభుత్వం మనలో పుట్టిందా లేదా అమెరికా నుంచి ఏమైనా…
APPSC Exams: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021లో విడుదల చేసిన పలు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షా తేదీలను అధికారులు విడుదల చేశారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, సబ్జెక్ట్ పేపర్ పరీక్షా తేదీలను ఏపీపీఎస్సీ అధికారులు ప్రకటించారు. గెజిటెడ్ విభాగంలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు అక్టోబర్ 21న జరుగుతాయి. సబ్జెక్ట్ పేపర్ పరీక్షల్లో పేపర్-2 19వ తేదీ…
ముఖ్యమంత్రి ఇల్లు, ఆఫీసు ఒక చట్టబద్ధ వ్యవస్థ.. అటువంటి వ్యవస్థల పై దాడి చేయటానికి పిలుపు ఇవ్వటం చట్ట వ్యతిరేకం.. వాటికి కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. ఉద్యోగుల ఆందోళన, పిలుపులపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. చట్టబద్ధ వ్యవస్థ పై దాడి జరగకుండా నివారించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.. ఈ పిలుపునకు బాధ్యులైన వ్యక్తులను రాత్రి జిల్లాల్లో అదుపులోకి తీసుకున్నాం.. వారందరికీ 41 నోటీసులు ఇచ్చి పంపించేశాం అన్నారు..…
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు సెక్రటరీ ఎంవీ శేషగిరి బాబు విడుదల చేశారు. ఈ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్ట్ 3 నుంచి 12వ తేదీ వరకు జరిగాయి. జనరల్ ఇంటర్ తో పాటు ఒకేషనల్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఇక ఈ పరీక్షకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే వీరిలో.. 70.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్ లో…