శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు… ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారామె.. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి… ఓ హోటల్ నడుపుతోన్న మహిళ దగ్గరకు వెళ్లిన సీఐ అంజూ యాదవ్… ఆమె భర్త ఆచూకీ ఎక్కడని అడిగింది.. అయిత, ఆమె తెలియదని సమాధానం ఇవ్వడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన సీఐ.. మహిళపై దాడి చేసింది.. నడి రోడ్డుపై మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు.. చీర ఊడిపోయేలా కొట్టి, బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించారు.. ఆపరేషన్ అయిన మా అమ్మను కొట్టుద్దు అంటూ ఆమె కుమారుడు వేడుకున్నా.. వినకుండా దాడి చేసిందంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.. ఆ తర్వాత బలవంతంగా పోలీసు జీపు ఎక్కించి రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు సీఐ అంజూ యాదవ్…
Read Also: 24 marriages: 30 ఏళ్లు కూడా లేవు.. 24 పెళ్లిళ్లు.. ఇలా దొరికిపోయాడు..
ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధిత మహిళ.. అకారణంగా.. సీఐ నన్ను దూషించారని.. పెద్ద ఆపరేషన్ చేయించుకున్నానని చెప్పినా వినకుండా బూటికాలితో తన్నారని.. నా కొడుకు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. విచక్షణారహితంగా ప్రవర్తించారని కన్నీరు మున్నీరవుతున్నారు బాధిత మహిళ.. అయితే, తన భార్యకు ఇటీవలే పెద్ద ఆపరేషన్ జరిగిందని, సీఐ అంజూ యాదవ్ గత కొంతకాలంగా తమను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత మహిళ భర్త హరి… సీఐ అంజు యాదవ్ పై ప్రవర్తనపై గతంలోనూ పలు విమర్శలు ఉన్నాయి.. ఇటీవల శ్రీకాళహస్తిలో ఆందోళనకు దిగిన విపక్ష నేతల పట్ల దురుసుగా ప్రవర్తించి, ఇద్దరు వ్యక్తులపై చేయి చేసుకొని చెంప చెల్లుమనిపించారట సీఐ అంజూ యాదవ్.