అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు… ఈ సారి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు… ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.. ఈ నెల 24వ…
ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.948.35 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్.. ప్రస్తుత 2022-23 అర్థిక సంవత్సరంలో ఆరు నెలలకు గాను అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ సంస్థలకు నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం… 15 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామాల్లో తాగునీరు సరఫరా, పారిశుధ్యం, పరిశుభ్రత అభివృధ్ది కోసం నిధులను విడుదల చేసినట్టు కేంద్ర సర్కార్…
సర్కారీ బడుల రూపరేఖల్ని మార్చేస్తున్న జగన్ సర్కార్… విద్యార్థులకు మెరుగైన విద్య అందేందుకు చర్యలు చేపడుతోంది. టీచర్లు రోజూ స్కూల్కు రావడమే కాదు… సమయపాలన పాటించేలా చేస్తోంది. దీనికోసం నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ యాప్ను ఉపయోగించబోతోంది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తోంది ఏపీ సర్కార్. ఇప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కూడా నడుం కట్టింది. టీచర్లకు ప్రత్యేకంగా తయారు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ యాప్ను ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్ వైఎస్…
* ఆసియా కప్: నేడు శ్రీలంకతో బంగ్లాదేశ్ ఢీ.. దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఢిల్లీ: నేటి నుంచి జరగాల్సిన నీట్-పీజీ కౌన్సెలింగ్ వాయిదా * కడప జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ పర్యటన.. ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయల్దేరనున్న సీఎం.. రేపు ఉదయం 9 గంటలకు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ దగ్గర సీఎం జగన్ నివాళి.. మధ్యాహ్నం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష,…
Somu Veerraju: ఏపీలోని కాకినాడ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన డీపీఆర్ను 90 రోజుల్లోగా ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఏజెన్సీ ఐఎఫ్సీఐ (ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కు పంపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు…