Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. చంద్రబాబు అసెంబ్లీని కాదని బామ్మర్ది షోకు వెళ్లారని ఎద్దేవా చేస్తూ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. చంద్రబాబు బామ్మర్ది షోకు వెళ్లగా.. సీఎం జగన్ మాత్రం జనంలోకి వెళ్తున్నారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అందుకే ‘175 అన్‌స్టాపబుల్’ అంటూ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యంగా వైసీపీ వ్యూహారచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం గురించి సీఎం జగన్ పలు మార్లు వర్క్ షాప్ నిర్వహించి వైసీపీ ప్రజాప్రతినిధులకు హితబోధ చేశారు. ప్రజల్లోకి వెళ్తే 175 సీట్లు సాధించడం అసాధ్యమేమీ కాదని జగన్ పదే పదే చెప్తున్నారు.
"అసెంబ్లీ"ని కాదని
బామ్మర్ది "షో"కెళ్ళిన బాబు
జనం లో… కెళ్ళిన జగన్
అందుకే "175-unstopable"!— Ambati Rambabu (@AmbatiRambabu) October 5, 2022
Read Also: ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు
అటు దసరా సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు చంద్రబాబుకు వేద ఆశీర్వచనం చేశారు. కాగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా అంటే శక్తిపూజ అని.. అధర్మంపై పోరాడే కొద్దీ మనలో శక్తి ఎదుగుతుందన్నారు. అది అంతిమంగా విజయాన్ని ఇస్తుందని చంద్రబాబు ట్వీట్ చేశారు. దసరా చెడును నిర్మూలిస్తుందని.. దుర్గ అవతారాలు మనకు చెప్పేది ఇదేనన్నారు. ప్రజల సంకల్పాలను నెరవేర్చుకునే శక్తిని ఆ జగన్మాత అనుగ్రహించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.