* నేడు మధ్యాహ్నం 2.17 గంటలకు ఆర్టెమిస్-1 ప్రయోగం.. చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపేందుకు ప్రయోగం.. * కేరళ: నేడు తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ భేటీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం * తెలంగాణలో నేటితో ముగియనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన.. నేడు ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి.. రైతులతో సమావేశం కానున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ * నేడు తెలంగాణ కేబినెట్…
ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పేరుతో భారీ సంఖ్యలో అంటే మొత్తంగా 5 వేల సభలను నిర్వహించుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది బీజేపీ
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. విజయవాడలో ఇవాళ జెండా దిమ్మె విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొనగా.. అరెస్ట్‌లు, ఆందోళన వరకు వెళ్లింది వ్యవహారం.. అయితే. ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు నాదెండ్ల.. జెండా దిమ్మెలు ధ్వంసంతో జనసేన ప్రస్థానాన్ని ఆపగలరా? అని ప్రశ్నించారు.. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అరెస్టు అప్రజాస్వామికం అంటూ మండిపడ్డ…
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వాట్సాప్ వీడియో కాల్ లీక్ పెద్ద కలకలం సృష్టించింది.. దానిపై ఫోరెన్సిక్ నివేదికలు.. దానికి కౌంటర్లు.. ధర్నాలు, ఆందోళనలు.. ఇలా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రచ్చే జరిగింది.. అయితే.. అ విషయంపై ఇవాళ స్పందించారు.. ఏజీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కుప్పంలో జరిగిన ఘటనలపై సమీక్ష జరుగుతోంది… కుప్పం ఘటనలు మరీ పెద్దవి కాదు… లా అండ్ ఆర్డర్ అదుపు తప్పేలా…
నెల రోజుల పాటు ఏసీ బస్సుల ఛార్జీల్లో డిస్కౌంట్ తీసుకొచ్చింది... ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా ఛార్జీలు తగ్గించింది ఆర్టీసీ.. ఏసీ బస్సుల ఛార్జీలో 20 శాతం వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఒక విఫల నాయకుడు.. కుప్పం నియోజకవర్గాన్ని కూడా నిలుపుకోలేక పోయారని వ్యాఖ్యానించారు.. చంద్రబాబు తాను మొదటి సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోజును ఘనంగా నిర్వహించుకున్నారు.. మొదటి సారి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో, పదవి కోసం పన్నిన కుట్రలు కూడా ప్రజలకు చెబితే బాగుండేదని ఎద్దేవా చేశారు.. ఎన్టీఆర్ అద్భుతమైన…
ఆంధ్రప్రదేశ్ మంత్రి విశ్వరూప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం అమలాపురంలో నిర్వహించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత అస్వస్థతకు గురైనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.. దీంతో.. హుటాహుటిన మంత్రి విశ్వరూప్‌ను.. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అనుచరులు.. ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్ష పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎలా…
Sajjala Ramakrishna Reddy: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి సజ్జల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగంలా సాగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం వచ్చేంత వరకు పేదలకు వైద్యం అందే పరిస్థితి లేదన్నారు. మానవతా దృష్టితో ఆలోచించి వైఎస్ఆర్ తెచ్చిన పథకమే ఆరోగ్యశ్రీ అన్నారు. పిల్లలకు మంచి చదువులు,…
CM Jagan: ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేసుకున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోయి నేటితో 13 ఏళ్లు పూర్తవుతోంది. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీ సీఎం జగన్ నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి, ఇతర వైఎస్ఆర్ కుటుంబసభ్యులు కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ను తలుచుకుంటూ సోషల్ మీడియాలో జగన్ ట్వీట్ చేశారు. ‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన…
Fire Accident: ప్రకాశం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొమరోలు మండలం దద్దవాడ శివారులో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు చెలరేగి లారీకి మొత్తం మంటలు వ్యాపించాయి. క్రమంగా అవి లారీ మొత్తానికి వ్యాపించడంతో అందులో ఉన్న 306 సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలిపోయాయి. దీంతో భయంతో డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి దిగి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. ఒక్కొక్కటిగా భారీ శబ్దాలతో సిలిండర్లు పేలడంతో సమీపంలోని…