ఓ వైద్యురాలు తన యావదాస్తిని ఆస్పత్రికి విరాళంగా ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.. ఈ రోజుల్లో ఆస్తుల విషయంలో అయినవారికి కూడా దూరం అవుతున్నారు.. ప్రాణాలు కూడా తీస్తున్నారు.. అయితే, అమెరికాలో స్థిరపడిన గుంటూరుకు చెందిన వైద్యురాలు డాక్టర్ ఉమా గవిని తనకున్న రూ.20 కోట్ల విలువైన ఆస్తిని మొత్తం జీజీహెచ్‌కు దానం చేశారు.. తన కోసం చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగ్చుకోకుండా.. మొత్తం తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు.. రూ. 20 కోట్ల విలువైన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లాకు చెందిన వైద్యురాలు ఉమా.. అమెరికాలో స్థిరపడ్డారు.. అమెరికాలో ఇమ్యునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలి్‌స్టగా పనిచేస్తున్న ఆమె.. గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్ పూర్తి చేశారు.. ఆ తర్వాత ఉన్నతవిద్య కోసం నాలుగు దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లిపోయారు.. అంతేకాదు.. స్పెషలిస్ట్ డాక్టర్‌గా అక్కడే స్ధిరపడ్డారు.. అయితే, డల్లాస్ వేదికగా గత నెలలో గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్ సమావేశాలు జరిగాయి.. ఈ సమావేశాల్లో పాల్గొన్న ఉమ.. తాను మెడిసిన్ చేసిన జీజీహెచ్‌కు విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. కనీస బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తన వద్ద లేకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్తి మొత్తాన్ని ఆమె విరాళంగా ఇచ్చారు.
2008లో వైద్యురాలైన ఉమ ‘జింకానా’ అధ్యక్షురాలిగా పనిచేశారు.. ఇక, ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు పేర్కొన్నారు.. కానీ, ఈ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తోసిపుచ్చారు… దీంతో, ఆమె భర్త.. డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరును ఈ బ్లాక్‌ను పెట్టాలని నిర్ణయించారు వైద్యులు.. కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చేసి, ఎనస్థటి్‌స్టగా సేవలు అందించిన కానూరి రామచంద్రరావు.. మూడేళ్ల కిందట ప్రాణాలు విడిచారు.. ఆమెకు వారసులు కూడా లేరు.. దీంతో డాక్టర్ ఉమ తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. ఏదేమైనా.. వైద్యురాలి నిర్ణయంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.. తమ ఆస్తిలో సగం.. 60 శాతం.. చివరకు 90 శాతం వరకు విరాళంగా ఇచ్చినవారు ఉన్నారు.. కానీ, డాక్టర్ ఉమ మాత్రం తన యావదాస్తిని మొత్తం దానం చేసి వార్తల్లో నిలిచారు. ఇక, ఆమె నిర్ణయంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు..