Love Marriage at YSP Office: ప్రేమికులను కలిపిన ఎమ్మెల్యే.. వైసీపీ కార్యాలయంలో పెళ్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు.. అయితే, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు.. దాని కారణం.. వారు వేర్వేరు కులాలకు చెందినవారు కావడమే.. అయితే, ఆ ప్రేమికులు మాత్రం.. విడిచి బతకలేక.. పెద్దలను కాదనలేక తీవ్ర ఆవేదనతో ఉన్నారు.. అవకాశం దొరికినప్పుడల్లా కలుస్తూనే ఉన్నారు.. ఈ విషయం గ్రామ పెద్దల వరకు వెళ్లింది.. వారు చెప్పినా.. ఆ ప్రేమ జంట మాత్రం వెనక్కి తగ్గలేదు.. గ్రామ పెద్దల ద్వారా స్థానిక ఎమ్మెల్యేలకు ఈ వ్యవహారం తెలిసింది.. ఇక, తల్లదండ్రులను ఒప్పించిన ఎమ్మెల్యే.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే.. వారికి పెళ్లి జరిపించారు.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: Bridge Collapses: బీహర్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే ఇలా..
Also Read
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురానికి చెందిన లంకలపూడి దుర్గామల్లేష్, విజయ మధ్య పరిచయం ఏర్పడింది.. అదికాస్తా ప్రేమగా మారింది.. అయితే, వారి ప్రేమ వ్యవహారం ఇరువురి తరుపు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో.. ఈ విషయం కాస్తా గ్రామ పెద్దల వరకు వెళ్లింది.. పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ.. యువతీ యువకులు ఇరువురు తమ ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దీంతో.. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు గ్రామ పెద్దలు.. ఈ ఘటనలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి.. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలని ఒప్పించి.. గ్రామ పెద్దలు, కుటుంబసభ్యుల సమక్షంలో ఆ ప్రేమికులను ఒక్కటి చేశారు.. అనపర్తిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఈ ప్రేమ పెళ్లికి వేదికైంది.. వైసీపీ కార్యాలయంలో ప్రేమ జంటను దండలు మార్పించారు ఎమ్మెల్యే.. ఆ తర్వాత ఎమ్మెల్యే కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది ప్రేమ జంట.. ఇక, ఈ పెళ్లికి లక్ష్మీ నరసాపురం గ్రామ పెద్దలు.. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, కొంతమంది బంధువులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!